Guinness World Records: పుషప్ స్టైల్ లో రింగును గిర గిర తిప్పిన వ్యక్తి.. గిన్నిస్ రికార్డ్ సాధించేశాడు.. ఈ వీడియో చూడండి..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జిడబ్ల్యుఆర్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల ప్రత్యేకమైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రసిద్ధి చెందింది. చాలా మంది ఔత్సాహికులు తమ ప్రతిభను గిన్నీస్ లోకి ఎక్కించాలని తపన పడతారు.
Guinness World Records: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జిడబ్ల్యుఆర్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల ప్రత్యేకమైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రసిద్ధి చెందింది. చాలా మంది ఔత్సాహికులు తమ ప్రతిభను గిన్నీస్ లోకి ఎక్కించాలని తపన పడతారు. ఇటీవల గిన్నీస్ లో ఓ కొత్త రికార్డ్ నమోదు అయింది. ఆ రికార్డ్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది గిన్నీస్ బుక్. ఒబారోఎన్ ఒటిటిగ్బే అనే వ్యక్తి ఒక రికార్డ్ సృష్టించాడు, అతను హులా ఉదర ప్లాంక్ స్థానంలో ఉన్నాడు. ఆ వీడియోలో ఓ వ్యక్తి రెండు బల్లలపై భూమికి సమాంతరంగా ఎత్తులో ఉన్నాడు. ఎబ్డామినల్ ప్లాంక్ పొజిషన్ గా పేర్కొనే ఆ విధానంలో అతను ఉన్నాడు. ఆ పొజిషన్ లో అతను హుల హూపింగ్(hula hooping) అనే ప్రక్రియను ఆపకుండా 3 నిమిషాల 16 సెకన్లలో చేయడం కనిపించింది. ఇది ప్రపంచ రికార్డ్ గా గిన్నీస్ బుక్ పేర్కొంది. ఈ రికార్డ్ సృశించిన ఆ వ్యక్తి పేరు ఒబెరాన్. న్యూ యార్క్ కు చెందిన వ్యక్తి.
ఇక ఈ విభాగంలో (హులా హూపింగ్) ఇలా చేసిన వ్యక్తి ఇతను ఒక్కడే కావడం విశేషం. అంతకు ముందు అమెరికాకు చెందిన అల్బానీ 152.52 మీటర్లు రింగ్స్ పై ఊగిసలాడుతూ మెట్లు ఎక్కిన రికార్డు ఉంది. ఒబెరాన్ చేసిన పద్ధతిలో మాత్రం ఎవరూ హుల హూపింగ్ చేయలేదని గిన్నిస్ పేర్కొంది.
ఇదీ ఆ గిన్నీస్ రికార్డ్ వీడియో..
View this post on Instagram
ఒక రింగును నడుముకు తగిలించుకుని అది పడిపోకుండా తిప్పుతూ ఉంటారు కదా.. అదే హుల హూపింగ్ అంటే. నిలబడి చేసే ఆ ఫీట్ ను నెలకు సమాంతరంగా కొంత ఎత్తులో పుషప్ చేసే పద్ధతిలో పడుకుని ఒబెరాన్ ఎక్కువసేపు చేశాడు. అదీ ఈ హుల హూపింగ్ రికార్డు సంగతి.
ఇన్‌స్టాగ్రామ్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే దాదాపు 50 వేల లైకులు సాధించింది.
Also Read: Corona Treatment: తెలుగు రాష్ట్రాలకు కరోనా సెకెండ్ వేవ్ షాక్.. వేల సంఖ్యలో బెడ్లు..మరి సమస్యేంటి?