Corona Treatment: తెలుగు రాష్ట్రాలకు కరోనా సెకెండ్ వేవ్ షాక్.. వేల సంఖ్యలో బెడ్లు..మరి సమస్యేంటి?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్ర ప్రజలను గడగడ వణికిస్తున్నాయి.

Corona Treatment: తెలుగు రాష్ట్రాలకు కరోనా సెకెండ్ వేవ్ షాక్.. వేల సంఖ్యలో బెడ్లు..మరి సమస్యేంటి?
Hospitals In Telugu States
Follow us

|

Updated on: Apr 26, 2021 | 7:38 PM

Corona Treatment in Telugu states: కరోనా వైరస్ సెకండ్ వేవ్ (CORONAVIRUS SECOND WAVE) రెండు తెలుగు రాష్ట్రాలను (TELUGU STATES) అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) రాష్ట్ర ప్రజలను గడగడ వణికిస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులను అడ్రస్ చేసేందుకు తెలుగు ప్రభుత్వాలు వైద్య సౌకర్యాలను పెంచుతున్నాయి. కోవిడ్ (COVID-19) బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు, వారికి చికిత్స అందించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.

ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH) రాష్ట్రంలో మొత్తం 363 ఆస్పత్రులుండగా ఆల్‌మోస్ట్ అన్ని ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి అందుబాటులో ఆక్సిజన్ సౌకర్యంతో 16 వేల 565 బెడ్లను సిద్ధం చేశారు. వీటిలో 8126 బెడ్లు కరోనా బాధితులతో ఆక్యుపై కాగా ఇంకా 8439 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 4523 ఐసియు బెడ్లను అందుబాటులో ఉంచగా 2117 బెడ్లు కరోనా బాధితులతో నిండాయి. ఇంకా 2406 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. సాధారణ బెడ్లు మొత్తం 9633 అందుబాటులో ఉండగా.. వీటిలో 3305 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 6328 సాధారణ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 30 వేల 721 బెడ్లను కరోనా బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 2791 బెడ్లను వెంటిలేటర్ సౌకర్యంతో ఏర్పాటు చేశారు.

ఇక తెలంగాణ (TELANGANA) విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులలో 5,014 బెడ్లను కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేశారు. వీటిలో 1,109 బెడ్లలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 4005 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 14 వేల 496 బెడ్లను కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో 3,279 బెడ్లలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 11 వేల 217 బెడ్లు కరోనా బాధితుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో 16 వేల 866 బెడ్లను రెడీ చేశారు. అందులో 9866 మంది చికిత్స పొందుతుండగా మరో 7,022 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 9098 ఐసియు బెడ్స్ ఉండగా వీటిలో 5690 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 3408 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల కోసం కేటాయించిన బెడ్ల సంఖ్య 45 వేల 594. కాగా వీటిలో 9948 బెడ్లలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 25 వేల 652 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ALSO READ: పోలవరానికి మరో 333 కోట్లు.. విడుదలకు కేంద్రం సుముఖం.. ఇంకా రావాల్సిందెంత?

ALSO READ: ఘోర ప్రమాదానికి వేదిక.. వీపరీతమైన అణుధార్మికత.. ఇపుడు సుందర పర్యాటక ప్రదేశం

ALSO READ: మరోసారి కఠినంగా లాక్‌డౌన్? సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వం!