Polavaram Project: పోలవరానికి మరో 333 కోట్లు.. విడుదలకు కేంద్రం సుముఖం.. ఇంకా రావాల్సిందెంత?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో 333 కోట్ల రూపాయలను రియంబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు వచ్చింది.

Polavaram Project: పోలవరానికి మరో 333 కోట్లు.. విడుదలకు కేంద్రం సుముఖం.. ఇంకా రావాల్సిందెంత?
Polavaram
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 26, 2021 | 6:36 PM

Polavaram Project funds released: పోలవరం ప్రాజెక్టు (POLAVARAM PROJECT) నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో 333 కోట్ల రూపాయలను రియంబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ (UNION FINANCE MINISTRY) ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. నాబార్డ్ (NABARD) ఆధ్వర్యంలో ఈ నిధులను సమీకరించారు బోతున్నారు. ఏపీ రాష్ట్ర సర్కార్ (AP STATE GOVERNMENT) కు ఈ నిధులతో పాటు మరో నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను రియంబర్స్మెంట్ ప్రతిపాదించింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ (POLAVARAM PROJECT AUTHORITY). ఈ నేపథ్యంలో మొత్తం 930 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH) ప్రభుత్వానికి చేరాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏపీ ప్రభుత్వం సమర్పిస్తోంది వాటిని పరిశీలించి కేంద్ర జల శక్తి శాఖ ఆమోద ముద్ర వేస్తే ఆర్థిక శాఖ సిఫారసు మేరకు ప్రభుత్వానికి నాబార్డు ద్వారా నిధులు విడుదల అవుతాయి. ఈ క్రమంలోనే తాజాగా 333 కోట్ల రూపాయలను రియంబర్స్ రూపంలో ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసేందుకు ఏప్రిల్ 26వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా పోలవరం ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17 వేల 153 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇందులో 12 వేల 422 కోట్ల రూపాయలు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు (POLAVARAM NATIONAL PROJECT)గా ప్రకటించిన తర్వాత చేసిన పనుల మొత్తంగా కనిపిస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని తామే నాబార్డు ద్వారా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) ప్రకటించింది. దాంట్లో భాగంగానే ఇప్పటివరకూ 10 వేల 741 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఇంకా 1, 681.37 కోట్ల రూపాయలను కేంద్రం బకాయి పడింది. ఈ మొత్తాన్ని కూడా రీయింబర్స్‌ చేయాలని పీపీఏ (PPA)కు రెండు నెలల కిందటే రాష్ట్ర జలవరులశాఖ అధికారుల ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన పీపీఏ గత నెలలో 333 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఏప్రిల్ నెలలో కూడా 418 కోట్లను రీయింబర్స్‌ చేయాలని ప్రతిపాదనలు పంపింది పీపీఏ. అయితే మార్చి నెలలో పంపిన ప్రతిపాదనలను కేంద్ర జలశక్తి శాఖ గ్రీన్ సిగ్నల్ మేరకు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ 333 కోట్లు విడుదల అయిన తర్వాత కూడా రాష్ట్రానికి ఇంకా 1,348.37 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి వుంది. ఏప్రిల్ నెలలో పంపిన ప్రతిపాదనల్లో పీపీఏ ప్రతిపాదించిన 418 కోట్ల రూపాయలకు కూడా త్వరలోనే ఆమోదం లభిస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. అవి కూడా విడుదలైతే కేంద్రం మరో 930.37 కోట్లు ఏపీకి బాకీ ఉంటుంది.

పోలవరం నిధుల విడుదల తీరు…

ఉమ్మడి ఏపీ విభజన చట్టం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 తర్వాత పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించాల్సి వుంది. 2016 సెప్టెంబర్‌ 8 వరకు పోలవరానికి కేంద్రం వార్షిక బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించి విడుదల చేస్తూ వచ్చింది. నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో నాబార్డు నుంచి రుణం తీసుకుని పోలవరానికి నిధులిస్తామని వెల్లడించారు. అప్పటినుంచి అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ALSO READ: ఘోర ప్రమాదానికి వేదిక.. వీపరీతమైన అణుధార్మికత.. ఇపుడు సుందర పర్యాటక ప్రదేశం

ALSO READ: మరోసారి కఠినంగా లాక్‌డౌన్? సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వం!

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్