లాక్ డౌన్ ప్రసక్తే లేదు, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటన, కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టీకరణ

కేరళలో లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దీని బదులు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

లాక్ డౌన్ ప్రసక్తే లేదు, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటన, కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టీకరణ
Pinarayi Vijayan
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Apr 26, 2021 | 8:23 PM

కేరళలో లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దీని బదులు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు సినిమా హాళ్లు, క్లబ్బులు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ , బార్లు తదితరాలను మూసివేయాలని నిర్ణయించామన్నారు. నేడు జరిపిన  అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. పూర్తి లాక్ డౌన్ విధించరాదని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. శని, ఆదివారాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు, నిత్యావసర సర్వీసులను అనుమతిస్తామని ఆయన చెప్పారు. రాత్రి ఏడున్నర గంటలకల్లా అన్ని షాపులను, రెస్టారెంట్లను మూసివేయాలని, రాత్రి 9 గంటల వరకు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు. అన్ని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన ఫంక్షన్లు, గేదరింగ్ లను నిషేధిస్తున్నామన్నారు . ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ వాహనాలను అనుమతించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేరళలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. కాగా నిన్న ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 28,469 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  దేంతో ఈ కేసుల సంఖ్య 2.18,893 కి చేరుకుంది.

ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ కూడా కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. ఇంట్లో స్వీయ నియంత్రణలో ఉన్నారు. దేశంలో కోవిద్ ప్రబలంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Whatsapp: 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్.. వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్‌..!

AP Corona Updates: ఏపీలో కరోనా విలయతాండవం.. గడిచిన 24 గంటల్లో 9,881 పాజిటివ్‌ కేసులు