కోవిడ్ పై పోరు, జనరల్ బిపిన్ రావత్ తో ప్రధాని మోదీ సమీక్ష, ఆక్సిజన్ సిలిండర్ల తరలింపునకు నిర్ణయం
దేశానికి పెను సమస్యగా, సవాలుగా మారిన కోవిడ్ పై ప్రధాని మోదీ సోమవారం డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
దేశానికి పెను సమస్యగా, సవాలుగా మారిన కోవిడ్ పై ప్రధాని మోదీ సోమవారం డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ పాండమిక్ విషయంలో, దీన్ని అదుపు చేయడంలో సాయుధ దళాలు చేపట్టిన కార్యక్రమాలు, సన్నాహాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల లోని వైద్య అధికారులు, సిబ్బంది అంతా మెడికల్ ఆసుపత్రుల్లో పని చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆ తరువాత ప్రభుత్వం తెలిపింది. సాయుధ దళాల్లో గత రెండేళ్లలో రిటైరైన లేదా ముందే రిటైర్మెంట్ కోరిన మెడికల్ సిబ్బంది సేవలను వివిధ ఆసుపత్రుల్లో వినియోగించుకునేలా చూస్తామని జనరల్ బిపిన్ రావత్..ప్రధానికి తెలిపారు. వీరి వీరి నివాస ప్రాంతాలకు సమీపంలోని ఆసుపత్రుల్లో వీరు పని చేసేలా చూస్తామని, అనేకమంది ఇందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన చెప్పారు. ముందే పదవీ విరమణ చేసినవారి సేవలను కూడా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కమాండ్ హెడ్ క్వార్ట్రర్స్, కార్స్ హెడ్ క్వార్ట్రర్స్, డివిజన్, నేవీ, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్ట్రర్స్ లో పని చేసే వైద్య సిబ్బందిని సైతం కోవిద్ ఆసుపత్రులకు తరలిస్తామన్నారు.
రక్షణ శాఖ ఆసుపత్రులన్నింటిలోనూ డాక్టర్లకు సాయం కోసం అదనపు నర్సింగ్ అధికారుల నియామకాలను చేపట్టినట్టు రావత్ తెలిపారు. అలాగే వివిధ రక్షణ శాఖ విభాగాల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు తరలించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్, ఇతర అత్యవసర తరలింపుతో సహా భారత వాయుసేన కార్యక్రమాలను ప్రధాని సమీక్షించారు. వివిధ హెడ్ క్వార్ట్రర్లలో ఉన్న కేంద్రీయ, రాజ్య సైనిక్ వెల్ఫేర్ అధికారులతో కూడా మోదీ మాట్లాడారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Salman Khan And Allu Arjun: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సల్మాన్ ఖాన్.. లవ్ యూ బ్రదర్ అంటూ..