West Bengal Election 2021 Phase 7 Voting Highlights: ప్రశాంతంగా ముగిసిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడో విడత పోలింగ్

Balaraju Goud

| Edited By: Subhash Goud

Updated on: Apr 26, 2021 | 8:50 PM

Bengal Assembly Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు 8 దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఇవాళ 7 విడత పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా ఇవాళ 5..

West Bengal Election 2021 Phase 7 Voting Highlights: ప్రశాంతంగా ముగిసిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడో విడత పోలింగ్
West Bengal Assembly Elections 2021

Bengal Assembly Elections 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు 8 దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఇవాళ 7 విడత పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా ఇవాళ 5 జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నందున కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇవాళ దినజ్‌పూర్‌ జిల్లాలో6 నియోజకవర్గాలు, మాల్డా జిల్లాలోని 6 నియోజకవర్గాలు, ముష్రీదాబాద్‌ జిల్లాలోని 9 నియోజకవర్గాలు, పశ్చిమ బర్దమాన్‌ జిల్లాలో 9 నియోజకవర్గాలు, కోల్‌కతాలో 4 నియోజకవర్గాల్లో ఎన్ని్కల పోలింగ్ నిర్వహించారు.

ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక ఆంక్షలు విధించింది. దీంతో … ఇటు తృణమూల్ గానీ, అటు బీజేపీ గానీ… 6, 7 దశల్లో పెద్దగా ప్రచారం చెయ్యలేదు. మమతా బెనర్జీ ప్రచారం చెయ్యబోనని ముందే ప్రకటించారు. దానికి బదులుగా ఆమె మొన్న తారామాత ఆలయానికి వెళ్లి పూజలు చేసి… కరోనా వదిలిపోవాలని కోరారు. నేటి పోలింగ్‌లో 81.88 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 39.87 లక్షల మంది మహిళలు ఉన్నారు. 11,376 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 268 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 37 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

కాగా, టీఎంసీ, బీజేపీలు 34 సీట్లలో పోటీ పడుతుంటే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇండియన్ సెక్యులరిస్ట్ ఫ్రంట్ కూటమి… ‘సంయుక్త మోర్చా’ పేరుతో బరిలో ఉన్నాయి. ఈ రౌండ్‌లో 34 సీట్లలో కాంగ్రెస్ 18 సీట్లలో, సీపీఎం 12 సీట్లలో, ఐఎస్‌ఎఫ్ 4 సీట్లలో, ఆర్ఎస్‌పీ 3 సీట్లలో, ఎఐఎఫ్‌బీ ఒక సీటులో పోటీ చేస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీ నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటం విశేషం.

ముర్షీదాబాద్, దక్షిణ్ దినజ్‌పూర్, మాల్టా జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. బెంగాల్‌లో అంతగా అభివృద్ధి లేని ప్రాంతాలుగా ఇవి ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్నాయి. ఐతే, అక్కడ ఈసారి అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం, ఇండియన్ సెక్యులర్ ఫోర్స్ బరిలో ఉన్నాయి. అందువల్ల ఈ పార్టీలకు కొన్ని ఓట్లు వెళ్లేలా కనిపిస్తున్నాయి. ఈసారి ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నించింది.

బెంగాల్‌లో ఈనెల 29న చివరిదైన 8వ విడత పోలింగ్‌ జరగనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఓట్లు లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

Read Also..  Harsh Vardhan: అనవసర రాజకీయాలు చేస్తున్నారు.. ఆ వ్యాక్సీన్లన్నీ రాష్ట్రాలకే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Apr 2021 07:57 PM (IST)

    ముగిసిన పోలింగ్‌.. ఈ విడతలో పోలింగ్‌ 81.05 శాతం నమోదు

    పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు 7వ దశ పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన  పోలింగ్..  ఈ విడతలో 81.05 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 11,376 పోలింగ్‌ స్టేషన్‌లలో పోలింగ్‌ జరిగింది. ఏప్రిల్‌ 29న చివరి దశ పోలింగ్‌ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

  • 26 Apr 2021 06:46 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

    పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

  • 26 Apr 2021 06:21 PM (IST)

    ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు పోలింగ్‌ శాతం

    పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5.30 గంటల వరకు దక్షిణ దినజ్‌పూర్‌లో 80.21 శాతం, మాల్డాలో 78.76 శాతం, ముర్షిదాబాద్‌లో 80.30 శాతం, కోల్‌కతాలో 57.91 శాతం, బుర్ద్వాన్‌లో 70.34 శాతం పోలింగ్ నమోదైంది.

  • 26 Apr 2021 06:14 PM (IST)

    ప్రతి దశలోనూ బీజేపీ విజయం – జేపీ నడ్డా

    ప్రతి దశ పోలింగ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేపీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీ విజయాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర నిరాశ గురి చేస్తాయని ఆయన అన్నారు.

  • 26 Apr 2021 05:45 PM (IST)

    సాయంత్రం 5.31 వరకు 75.06 శాతం పోలింగ్‌ నమోదు

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఏడవ దశలో సాయంత్రం 5.31 వరకు 75.06 శాత పోలింగ్‌ శాతం నమోదు: భారత ఎన్నికల సంఘం

  • 26 Apr 2021 04:21 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న మమతా బెనర్జీ

    పశ్చిమ బెంగాల్ ఎడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విజయ చిహ్నాన్ని చూపిస్తూ బయటకు వచ్చారు.

  • 26 Apr 2021 04:17 PM (IST)

    న్యూ అలీపూర్‌లో ఓటేసిన మంత్రి అరుప్ విశ్వస్

    రాస్‌బిహరీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీ నేత, రాష్ట్ర మంత్రి అరుప్ విశ్వస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యూ అలీపూర్ మల్టీపర్పస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.

    Bengal Minister Aroop Viswa

    Bengal Minister Aroop Viswa

  • 26 Apr 2021 04:10 PM (IST)

    ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తాంః మమతా బెనర్జీ

    ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణకు డిమాండ్ చేస్తామని మమతా చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నాము కాని కేంద్రం మాకు వ్యాక్సిన్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. బెంగాల్‌లో మోహరించిన 3లక్షల కేంద్ర భద్రతా దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని మమతా డిమాండ్ చేశారు.

    West Bengal Cm Mamata Benarjee

    West Bengal Cm Mamata Benarjee

  • 26 Apr 2021 03:53 PM (IST)

    మధ్యాహ్నం 3.31 గంటల వరకు 67.27% పోలింగ్ శాతం

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఏడో దశలో మధ్యాహ్నం 3.31 గంటల వరకు 67.27% పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

  • 26 Apr 2021 03:29 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లా ఫిల్మ్ సూపర్ స్టార్, టీఎంసీ ఎంపీ దేవ్

    పశ్చిమ బెంగాల్ ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాల్లో ఓటు బారులు తీరగా, కోల్‌కతా నగరంలో మాత్రం మందకొడిగా సాగుతోంది. బంగ్లా ఫిల్మ్ సూపర్ స్టార్, టీఎంసీ ఎంపీ దేవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    Bengal Film Star Dev

    Bengal Film Star Dev

  • 26 Apr 2021 02:22 PM (IST)

    మధ్యాహ్నం 1:32 వరకు 55.12 శాతం పోలింగ్

    పశ్చిమ బెంగాల్‌లోని 34 అసెంబ్లీ స్థానాల్లో ఏడోవ దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1:32 వరకు 55.12 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అటు బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓటింగ్ నెమ్మదిగా జరుగుతోంది.

  • 26 Apr 2021 11:58 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు 37.72 శాతం పోలింగ్

    పశ్చిమ బెంగాల్: ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.72 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

    దక్షిణ దినజ్‌పూర్: 39.59℅ మాల్డా: 40.15℅ ముర్షిదాబాద్: 42.43℅ దక్షిణ కోల్‌కతా: 27.56℅ పశ్చిమ బుద్ధామన్: 34.17℅

  • 26 Apr 2021 11:15 AM (IST)

    బీజేపీ ఏజెంట్‌ను గెంటేసిన టీఎంసీ నేతలు

    మాల్డాలోని రతువాలోని బఖ్రా గ్రామంలోని పోలింగ్ బూత్ నంబర్ 91 బీజేపీ పోలింగ్ ఏజెంట్ శంకర్ సాకర్ టీఎంసీ పార్టీ కార్యకర్తలు బలవంతంగా బయటకు పంపించారు. “గ్రామంలో నివసించే టీఎంసీ పార్టీ కార్యకర్తలు నన్ను అక్కడ ఓటరు కానందున వారు నన్ను అక్కడికి అనుమతించలేదు. వారు నన్ను బలవంతంగా బయటకు నెట్టారు” బీజేపీ ఏజెంట్ శంకర్ సాకర్ తెలిపారు.

  • 26 Apr 2021 11:11 AM (IST)

    సీఎం ఫోటోతో టోపీ ధరించిన టీఎంసీ పోలింగ్ ఏజెంట్..

    పశ్చిమ బెంగాల్ ఏడో విడత పోలింగ్ సందర్భంగా బక్తార్‌నగర్ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో టీఎంసీ పోలింగ్ ఏజెంట్.. సీఎం ఫోటోతో టోపీ ధరించి ఉన్నారని పశ్చిమ బర్ధమన్‌లోని అసన్‌నోసల్ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల అధికారి ఫిర్యాదు చేస్తానన్నారు.

  • 26 Apr 2021 10:59 AM (IST)

    ఓటేసిన భవానీపూర్ టీఎంసీ అభ్యర్థి శోభందేబ్

    పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న 7 వ దశ పోలింగ్‌లో భాగంగా భవానీపూర్ నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి శోభండేబ్ చటోపాధ్యాయ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోల్‌కతాలోని మన్మతానాథ్ నందన్ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన తరువాత శోభండేబ్ చటోపాధ్యాయ మాట్లాడుతూ.. బెంగాల్‌లో మమతా బెనర్జీకి తిరిగులేదని, ప్రజలు ఇక్కడ టీఎంసీకే ఓటు వేస్తారని చెప్పారు. మమతా బెనర్జీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుకున్నాయి.

  • 26 Apr 2021 10:36 AM (IST)

    ఓటేసిన సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపి అభిషేక్ బెనర్జీ ఇవాళ రోజు భవానీపూర్ ఫ్రెండ్స్ ఇనిస్టిట్యూషన్‌లో ఓటు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 మెజారిటీతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • 26 Apr 2021 10:33 AM (IST)

    ఉదయం 9:32 వరకు 17.47 శాతం పోలింగ్

    పశ్చిమ బెంగాల్: ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9:32 వరకు 17.47 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

  • 26 Apr 2021 09:38 AM (IST)

    టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ ఓటు వేశారు..

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో 7 వ దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ రుహి, ఆమె తల్లిదండ్రులు కోల్‌కతాలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

  • 26 Apr 2021 09:36 AM (IST)

    ఓటేసేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలో నిల్చున్నారు..

    ఏడవ దశకు ఓటింగ్ కొనసాగుతోంది. మాల్డా జిల్లాలోని రతువా నియోజకవర్గంలోని సమాసి ప్రాథమిక పాఠశాల బూత్‌లో ఓటర్లు ఓటు వేశారు. ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకునేందుకు క్యూలో నిలబడ్డారు.

  • 26 Apr 2021 09:33 AM (IST)

    ప్రధాని మోదీ ఓటర్లకు విజ్ఞప్తి

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఏడో దశ పోలింగ్ సందర్భంగా కోవిడ్ -19 మార్గదర్శకాన్ని అనుసరించి ఓటు వేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించాలని కోరారు.

  • 26 Apr 2021 09:31 AM (IST)

    34 స్థానాల్లో 284 మంది అభ్యర్థులు పోటీ

    పశ్చిమ బెంగాల్‌లోని 34 స్థానాల్లో 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 37 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఉదయం 7 నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

  • 26 Apr 2021 09:28 AM (IST)

    ఐదు జిల్లాల్లో 36 నియోజకవర్గాల్లో పోలింగ్

    బెంగాల్‌లో ఏడోవ దశ పోలింగ్ కొనసాగతోంది. ఈ దశలో మొత్తం ఐదు జిల్లాల్లోని 36 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఈ ఐదు జిల్లాలు దక్షిణ దినాజ్‌పూర్(6 నియోజకవర్గాలు), మాల్డా (6 నియోజకవర్గాలు), ముర్షిదాబాద్ (11 నియోజకవర్గాలు), కోల్‌కతా (4 నియోజకవర్గాలు), పశ్చిమ బుర్ద్వాన్ (9 నియోజకవర్గాలు). ఈ దశలో 37 మంది మహిళలతో సహా మొత్తం 268 మంది అభ్యర్థులు ఉన్నారు.

Published On - Apr 26,2021 7:57 PM

Follow us
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!