Viral News: ఒకేసారి 35 మంది యువతులతో డేటింగ్ చేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఒకే సమయంలో ఇద్దరూ లేదా ముగ్గురుతో డేటింగ్ చేసే వ్యక్తుల గురించి మీరు చాలాసార్లు...
ఒకే సమయంలో ఇద్దరూ లేదా ముగ్గురుతో డేటింగ్ చేసే వ్యక్తుల గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు.! ఇలాంటి కేసులు తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవల ఓ వ్యక్తి ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకంగా 35 మంది యువతులతో డేటింగ్ చేశాడు. ఇలా చేయడానికి అతడు చెప్పిన కారణం మీరు వింటే మరింత ఆశ్చర్యపోతారు.? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
తకాషి మియాగావా అనే 39 ఏళ్ల వ్యక్తి పుట్టినరోజు బహుమతుల కోసం ఒకరికి తెలియకుండా మరొకరితో డేటింగ్ చేయడం ప్రారంభించాడు. ఇలా ఏకంగా 35 మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. తన పుట్టినరోజు తేదీ వీరందరికీ తప్పు చెప్పి.. వేర్వేరు సందర్భాల్లో బహుమతులు తీసుకున్నాడు.
కేసును చాకచక్యంగా చేధించిన పోలీసులు..
తకాషి అనుకోని విధంగా చేసిన తప్పులే.. అతన్ని పట్టించాయి. తకాషి ఒక ప్రైవేట్ సంస్థలో పార్ట్‌టైమ్ వర్కర్, ప్రేమ కోసం కాకుండా బహుమతుల కోసం ఎంతోమంది యువతులతో డేటింగ్ చేయడం ప్రారంభించాడు. అతడు తన పుట్టినరోజు తేదీని వారందరికీ తప్పుగా చెప్పాడు. ఇక ఈ మోసాన్ని ఓ అమ్మాయి గ్రహించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం తతంగం బయటపడింది.