चुनाव क्षेत्र चुनें

రాజీబ్ బెనర్జీ-డోమ్జూర్‌ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

బీజేపీ | డోమ్జూర్‌

ఇటీవల కాలంలో టీఎంసీ వీడి బీజేపీలో చేరిన ప్రముఖ నాయకుల్లో రాజీవ్ బెనర్జీ ఒకరు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో రాజీవ్ బెనర్జీ టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. రాజీవ్ బెనర్జీ హౌరా జిల్లాలోని డోమ్జూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే. 2011, 2016 ఎన్నికలలో రాజీవ్ బెనర్జీ టీఎంసీ టికెట్‌పై వరుసగా రెండుసార్లు గెలిచారు. ఈసారి ఆయన బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. 2011 నుంచి 2018 వరకు రాజీవ్ బెనర్జీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 2019లో మమతా బెనర్జీ ఆయన్ను అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినప్పటికీ.. పార్టీలో తనకు సరైన ఆదరణ లభించలేదన్న కారణంతో టీఎంసీని వీడారు.

Ads By Adgebra