ఈసారి అందరి దృష్టి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని టాలీగంజ్ అసెంబ్లీ సీటుపై పడింది. దీనికి కారణం హై ప్రొఫైల్ అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేయడం. టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చేందుకుబిజెపి తన అభ్యర్థిగా అసన్సోల్ ఎంపీ, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను రంగంలోకి దింపింది. టీఎంసీ సీటింగ్ ఎమ్మెల్యే అయిన అరుప్ విశ్వాస్ ను మరోసారి తన అభ్యర్థిగా ప్రకటించింది. అరుప్ విశ్వాస్ 2006 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2016 ఎన్నికల్లో సీపీఎంకు చెందిన మధు సేన్ రాయ్‌ను 9,896 ఓట్ల తేడాతో ఓడించారు. బీజేపీ ఇక్కడ 15వేల ఓట్లనే సాధించి మూడవ స్థానానికే పరిమితమైంది.