హూగ్లీ జిల్లాలోని చండిట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ.. నటుడు యశ్ దాస్‌గుప్తాను అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా.. టీఎంసీ ప్రస్తుత ఎమ్మెల్యే అయిన స్వాతి ఖండోకర్ కు మరోసారి టికెట్ ఇచ్చింది. ఈ స్థానంలో సీపీఎం ప్రాభల్యం కూడా ఉండటంతో ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. మహ్మద్ సలీమ్ ఇక్కడి నుంచి సిపిఎం అభ్యర్థిగా ఉన్నారు. చండీట్ల అసెంబ్లీ నియోజకవర్గం శ్రీరాంపూర్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీఎంసీకి చెందిన స్వాతి ఖండోకర్ 91 వేల 874 ఓట్లు సాధించి.. సీపీఎంకు చెందిన అజీమ్ అలీని 14 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. బీజేపీ అభ్యర్థికి 12 వేల 843 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానానికి 1962 ఇప్పటివరకు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి.. ఇందులో కాంగ్రెస్ మూడుసార్లు, రెండుసార్లు ఇండిపెండెంట్లు, 7 సార్లు సీపీఎం, రెండుసార్లు టీఎంసీ అభ్యర్థులు గెలిచారు.