चुनाव क्षेत्र चुनें

మనోజ్ తివారీ-శివ్‌పూర్‌ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

టీఎంసీ | శివ్‌పూర్‌

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీఎంసీ ఆయనకు హౌరా శివపూర్ అసెంబ్లీ సీటును కేటాయించింది. మనోజ్ తివారీ స్వస్థలం కూడా ఇదే. టీఎంసీలో చేరడానికి ముందు.. ఆయన చమురు, వంట గ్యాస్ ధరలను పెంచడంపై, రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఆయన వార్తల్లో నిలిచారు. మనోజ్ తివారీ భారత్ తరఫున తక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఆయన దేశీయ క్రికెట్‌లో స్టార్ బ్యాట్స్ మాన్. తివారీ చాలా కాలం బెంగాల్ జట్టు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. ఐపీఎల్‌ ప్రారంభం నాటినుంచి మనోజ్ తివారీ ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్ జట్లలో ఆడారు. మనోజ్ తివారీని చాలా మంది బెంగాల్ కెవిన్ పీటర్సన్ అని కూడా పిలుస్తారు. 35 ఏళ్ల వయసులో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మనోజ్ తివారీ రాజకీయ భవిష్యత్తు ఏమిటీ అన్నది.. ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. శివపూర్‌ స్థానంలో బీజేపీ నుంచి రతీంద్రనాథ్ చక్రవర్తి పోటీలో ఉన్నారు.

Ads By Adgebra