AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుట్టుకున్న నారదా కేసు, ప్రతివాదిగా చేర్చాలంటూ కలకత్తా హైకోర్టులో సీబీఐ పిటిషన్

నారదా ముడుపుల కేసు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుట్టుకుంటోంది. ఆమెను, న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ను, పార్టీ నేత కళ్యాణ్ బెనర్జీని ఈ కేసులో ప్రతివాదులుగా సీబీఐ పేర్కొంది. కలకత్తా హైకోర్టులో విచారణ సందర్భంగా వీరి పేర్లను తన పిటిషన్ లో చేర్చింది...

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుట్టుకున్న నారదా కేసు,  ప్రతివాదిగా చేర్చాలంటూ కలకత్తా హైకోర్టులో సీబీఐ పిటిషన్
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 19, 2021 | 4:43 PM

Share

నారదా ముడుపుల కేసు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుట్టుకుంటోంది. ఆమెను, న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ను, పార్టీ నేత కళ్యాణ్ బెనర్జీని ఈ కేసులో ప్రతివాదులుగా సీబీఐ పేర్కొంది. కలకత్తా హైకోర్టులో విచారణ సందర్భంగా వీరి పేర్లను తన పిటిషన్ లో చేర్చింది. తమను విధి నిర్వహణ చేయకుండా ముఖ్యమంత్రి…తమ ఆఫీసు బయట ఉద్రిక్త స్థితి తలెత్తేలా ప్రేరేపించారని, ఈ కేసు విచారణను ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సీబీఐ కోరింది. ఈ కేసులో ఇటీవల అరెస్టు చేసిన నలుగురు నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారని, వీరిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించింది.ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, పార్టీకి చెందిన ఓ మాజీ నేతను మొత్తం నలుగురు ప్రస్తుతం జైల్లో ఉన్నారు .(మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్ర, మాజీ పార్టీ నేత సోవన్ ఛటర్జీ లను అరెస్టు చేసిన విషయం గమనార్హం)గత సోమవారం వీరిని సీబీఐ అరెస్టు చేసిన వెంటనే పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఈ దర్యాప్తు సంస్థ కార్యాలయం వద్దకు చేరుకొని తమ మంత్రులను విడుదల చేయాలనీ డిమాండు చేశారు. కార్యాలయంపైకి రాళ్ళ వర్షం కురిపించారు. అటు మమత కూడా కార్యాలయంలోనే ధర్నాకు కూర్చుని దమ్ముంటే తనను కూడా అరెస్టు చేయాలని సవాల్ విసిరారు.. నలుగురు నేతలకు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికి దాన్ని సవాలు చేస్తూ సీబీఐ కలకత్తా హైకోర్టుకెక్కడంతో ఆ ఉత్తర్వులపై కోర్టు స్టే జారీ చేసింది. దీంతో మళ్ళీ ఈ నలుగురిని సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపింది. మమ్మల్ని భయపెట్టడానికి, మా విధి నిర్వహణ సక్రమంగా జరగకుండా చూసేందుకు ఇదంతా ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే జరిగిందని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. ముందే వేసుకున్న పథకం మాదిరి ఉందని పేర్కొంది..

మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్‌ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..

ఒక్క ఫోన్ చేస్తే చాలు..స్కార్పియో అంబులెన్స్ ఫ్రీ సర్వీస్..ఎక్కడంటే.. సొంత వాహనాన్ని పబ్లిక్ సర్వీస్ కు అంకితం చేసిన యువకుడు ..:viral video.

ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అంటున్న లెక్కల మాస్టర్ సుకుమార్..! Allu Arjun Saved Sukumar Life video.