బెంగాల్ గవర్నర్ బర్త్ డే రోజున …రాజ్ భవన్ వద్ద మేకలు, గొర్రెలతో ఓ సంస్థ వింత నిరసన, ధన్ కర్ ఆగ్రహం, సంజాయిషీ ఇవ్వాలని డీజీపీకి ఆదేశం
సీబీఐ అరెస్టు చేసిన తమ మంత్రులను విడుదల చేయాలని బెంగాల్ లో ఓ వైపున తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన జరుపుతుండగా మరో వైపున గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ఎన్నడూ ఎరుగని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మంగళవారం రాజ్ భవన్ వద్ద నిషేధాజ్ఞలు అమలులో..
సీబీఐ అరెస్టు చేసిన తమ మంత్రులను విడుదల చేయాలని బెంగాల్ లో ఓ వైపున తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన జరుపుతుండగా మరో వైపున గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ఎన్నడూ ఎరుగని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మంగళవారం రాజ్ భవన్ వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ ధిక్కరించి కొంతమంది మేకలు, గొర్రెలతో అక్కడ వినూత్న నిరసనకు కూర్చున్నారు. ఇది తెలిసిన గవర్నర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాజ్ భవన్ వద్ద ఇలా కొందరు ప్రొటెస్ట్ చేస్తున్నా పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ నిలుచున్నారని సీఎం మమతా బెనర్జీని, డీజీపీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. (మంగళవారం ఆయన బర్త్ డే కూడానట) దీనిపై సాయంత్రం లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆయన డీజీపీని ఆదేశించారు. వీరిని అసాంఘిక శక్తులుగా ఆయన పేర్కొన్నారు. ఈ నిరసనకారులు సుమారు రెండు గంటలపాటు అక్కడ ఇలా ప్రొటెస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి చాలా అధ్వానంగా మారినందున ఇలా ప్రొటెస్ట్ చేశామని కోల్ కతా నాగరిక్ మంచ్ అనే సంస్థ పేర్కొంది. తమకు మరో దారి లేక రాజ్ భవన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించినట్టు ఈ సంస్థ పేర్కొంది.
కానీ గొర్రెలు, మేకలతో ఇలా వెరైటీ ప్రొటెస్ట్ చేయడం స్థానికులను ఆశ్చర్య పరిచింది. అందులోనూ గవర్నర్ బంగళా వద్ద వీరు చేరడాన్ని వారుప్రశ్నించుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..