चुनाव क्षेत्र चुनें

స్వపన్ దాస్‌గుప్తా-తారాకేశ్వర్‌ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

బీజేపీ.. రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తాను హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ సీటు నుంచి పోటీలో నిలిపింది. ఈ స్థానంలో దాస్‌గుప్తా.. టీఎంసీ నాయకుడు రామేందు సింఘా రాయ్‌పై పోటీ పడతున్నారు. గతంలో రెండుసార్లు జరిగిన ఎన్నికలలో దాదాపు 97 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచిన రక్షపాల్ సింగ్‌ను ఈసారి టీఎంసీ అభ్యర్థిగా ప్రకటించలేదు. 2016లో రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన స్వపన్ దాస్‌గుప్తా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్వపన్ దాస్‌గుప్తా చాలా కాలంగా బీజేపీ భావజాలంతో.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై వార్తాపత్రికలలో సంపాదకీయాలు రాస్తున్నారు. అయితే.. దాస్‌గుప్తకు 2015లో పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఇటీవలనే ఆయన ఎంపీకి రాజీనామా చేశారు.

Ads By Adgebra