2016లో టీఎంసీ గెలుపొందిన ముఖ్యమైన సీటులో కూచ్ బిహర్ సౌత్ సీటు ఒకటి. ఈ ప్రాంత ప్రజలు మిహిర్ గోస్వామి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అయితే.. మిహిర్ 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఆయన 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి డెబాసిస్ బానిక్‌ను సుమారు 18,000 ఓట్ల తేడాతో ఓడించారు. బీజేపీ మూడో స్థానంలోనే నిలిచింది. 1962 సంవత్సరంలో.. ఇక్కడ మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సునీల్ బసు అసెంబ్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత 72 నుంచి ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించింది. అయితే ఈ సీటును రద్దు చేశారు. విభజన అనంతరం ఈ సీటు మళ్లీ ఉనికిలోకి వచ్చింది. 2011 ఎన్నికలలో ఏఐఎఫ్‌బీ నుంచి అక్షయ్ తా గెలిచారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు టిఎంసి ఖాతాకు వెళ్లింది. ఈ అసెంబ్లీ సీటులో మొత్తం 2,13,162 మంది ఓటర్లు ఉన్నారు.