ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కామర్‌హాటీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మదన్ మిత్రాను టీఎంసీ అభ్యర్థిగా ప్రతిపాదించింది. బీజేపీ స్థానిక నాయకుడైన రాజీవ్ బెనర్జీని తన అభ్యర్థిగా నిలబెట్టింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మదన్ మిత్రా 2011లో ఈ నియోజకవర్గంలో గెలిచారు. కానీ 2016లో సీపీఐ అభ్యర్థి మనస్ ముఖర్జీ చేతిలో ఓడిపోయారు. ఈ నియోజకవర్గం దమ్ దమ్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. 1967 నుంచి 2016 వరకు జరిగిన 13 ఎన్నికలలో సీపీఎం అభ్యర్థులు 11 సార్లు గెలిచారు. టీఎంసీ 2011లో ఒక్కసారి మాత్రమే గెలిచింది. 1972లో కాంగ్రెస్‌కు చెందిన ప్రదీప్ కుమార్ విజయం సాధించారు. కానీ.. ఈసారి మదన్ మిత్రా.. రాజీవ్ బెనర్జీ నుంచి కఠినమైన సవాలును ఎదుర్కొంటున్నారు.