AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leander Paes Exclusive Interview: ‘సేవే నా లక్ష్యం.. అది ఆటలోనైనా, దేశ రాజకీల్లోనైనా.. నిజయితీకి నిలువటద్దంలా ఉంటా’: లియాండర్ పేస్

30 ఏళ్లపాటు ఓ ఆటగాడిగా దేశం తరపున ఆడి, ఎన్నో పతకాలు సాధించి, నేడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్న టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు..

Leander Paes Exclusive Interview: 'సేవే నా లక్ష్యం.. అది ఆటలోనైనా, దేశ రాజకీల్లోనైనా.. నిజయితీకి నిలువటద్దంలా ఉంటా': లియాండర్ పేస్
Leander Paes
Venkata Chari
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:27 PM

Share

Leander Paes: 30 ఏళ్లపాటు ఓ ఆటగాడిగా దేశం తరపున ఆడి, ఎన్నో పతకాలు సాధించి, నేడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్న టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. గోవాలో ఆ‍యన ఇటీవలే మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈమేరకు టీఎంసీలో చేరడానికి గల కారణాలు, తన ముందున్న సమస్యలు, ఎలా మార్పు తీసుకురావాలోలాంటి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నాడు. లియాండర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను కూడా పంచుకున్నాడు. సేవే నా లక్ష్యం.. అది ఆటలోనైనా, దేశ రాజకీల్లోనైనా.. నిజయితీకి నిలువటద్దంలా నేనుంటా అంటున్న లియాండర్ పేస్ ఇంకా ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..!

ప్ర: మీ కెరీర్‌లో ఈ 2వ ఇన్నింగ్స్‌ని మీరు ఎలా చూస్తున్నారు? క్రీడల కంటే భిన్నమైనది కదా, మీరు ఎలా రాణిస్తారు?

లియాండర్: నేను 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రయాణం చాలా అద్భుతంగా ప్రారంభమైంది. ప్రజల నుంచి పొందుతున్న స్పందన, వీధుల్లోకి వెళ్లి ప్రచారం చేయడం, ప్రజల ఇళ్లను సందర్శించడం, వారితో కూర్చొని వారిని అర్థం చేసుకోవడానికి, వారి సమస్యలను వినడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అయితే వాటిని నిజాయితీగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. నా అభిరుచికి తోడు ఇక్కడ ఎంతో మంది ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోగలిగితే అదే నాకు పెద్ద ప్రేరణ. ఇందులోనే నా అభిరుచి ఉంది. నేను టీఎంసీ పార్టీకి, మమతా దీదీకి, నా నాయకురాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ప్రజల దగ్గరకు వెళ్లే అవకాశం ఇచ్చారు. నా సోదరులు, సోదరీమణుల జీవితాలను మెరుగుపరిచే అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్ర: మీరు కోల్‌కతాకు చెందినవారు. అలాగే టీఎంసీ పశ్చిమ బెంగాల్‌లో ఎంతో బలంగా ఉంది. మరి కోల్‌కతాను కాకుండా గోవాను ఎందుకు ఎంచుకున్నారు?

లియాండర్: నా తండ్రి మూలాలు ఇక్కడ ఉన్నందున నేను గోవాను ఎంచుకున్నాను. కోల్‌కతా అయినా, గోవా అయినా నేను ఎప్పుడూ భారత జెండా కోసం ఆడాను. ఇది బెంగాల్ లేదా గోవా లేదా పంజాబ్ లేదా తమిళనాడు అనేది నాకు నిజంగా పట్టింపు లేదు. నేను ఎక్కడ పోటీచేసిన ప్రతీ భారతీయుడి జీవితాన్ని మెరుగుపరచాలనుకుంటున్నాను. సుపరిపాలన చేయడంతోపాటు ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, మంచి మనస్సాక్షితో కూడిన పాలన ద్వారా వారి సమస్యలను విని, పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తాను. క్రమబద్ధమైన పద్ధతిలో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను.

ప్ర: ఇతర రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయా? టీఎంసీనే ఎందుకు ఎంచుకున్నారు?

లియాండర్: అవును, నాకు గత 18 సంవత్సరాలుగా ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. కానీ, నేను నా టెన్నిస్‌పై ఎలాంటి మక్కువతో దృష్టి పెట్టానో, ఇప్పుడు రాజకీయాల్లోనూ అలానే ముందుకు వెళ్తాను. నేను అనుకున్న పనులను పరిపూర్ణంగా చేయడం కోసం కష్టపడతాను. ఉత్తమంగా పని చేయడానికి ఎంతో ఇష్టపడతాను. ఇంతకు ముందు ఆఫర్ వచ్చినప్పుడల్లా అది సరైన సమయం లేదా సరైన ఆఫర్ కాదని నమ్మాను. నాకు ఎక్కువ సమయం లేదు. ఆసమయంలో నేను వింబుల్డన్ గెలవడంపై దృష్టి సారించాను. డేవిస్ కప్‌లో ప్రపంచ రికార్డు, ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున ప్రపంచ రికార్డును నెలకొల్పేటప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాను. కానీ, మమతా దీదీ ఆశీర్వచనాలతో నా తండ్రి మూలాలు ఉన్న గోవాకు రావాలని నాకు ఆఫర్ ఇచ్చారు. అందుకే నేను ఒప్పుకున్నాను.

నేను ప్రస్తుతం గోవాపై దృష్టి పెట్టగలను. ఇది నా జీవితంలో ప్రత్యేక సందర్భం. ఇదే సరైన మార్గం. నా 2వ ఇన్నింగ్స్ అద్భుతమైన నోట్‌తో ప్రారంభమైంది. నా ముందు చాలా పొడవైన రహదారి ఉంది. ఇందులో చాలా కఠినమైన అడ్డందకులు కూడా ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. నేను 30 ఏళ్లుగా టెన్నిస్‌లో చేసినట్లే, ప్రజలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడంపై చాలా మక్కువతో ఉన్నాను. అందుకే అందులో ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను.

గత 5-6 వారాల్లో నేను రాజ్యాంగం గురించి మాత్రమే కాకుండా, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే పనిలో పడ్డాను. గోవాలో నాకు గొప్ప అవకాశం ఉంది. ఇది నిజంగా భారతదేశానే ఎంతో విలువైన రాష్ట్రం. దీని జనాభా కేవలం 15.9 లక్షలు, అందులో 9 లక్షల మంది స్థానికులు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు. మంచి క్రమబద్ధమైన పాలన ఇవ్వాలనుకుంటే మాత్రం అందుకు గోవానే చాలా మంచి అవకాశం. టీఎంసీ చేయాలనుకున్నది కూడా అదే. ఇక్కడ జరిగిన అన్ని తప్పుడు పనులకు సంబంధించిన ఛార్జ్ షీట్ మా వద్ద ఉంది. దానిని ఎలా సరిదిద్దాలో మాకు తెలుసు. మరీ ముఖ్యంగా గోవా రాష్ట్ర సంపద, అది మైనింగ్ అయినా, ఫిషింగ్ అయినా, ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. నిజాయితీతోపాటు క్రమబద్ధమైన పాలనతో భారతదేశంతోపాటు ప్రపంచంలో పవర్ హౌస్‌గా మారే అవకాశం గోవాకు మాత్రమే ఉంది.

ప్ర: గోవాలో ఎన్నికలు వస్తున్నాయా? మీ ముందున్న సమస్యలు ఏమిటి?

లియాండర్: గోవాలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. 12 తాలూకాలలో ఆరింటికి తాగునీరు సమస్యతో బాధపడుతున్నాయి. మేం వాటిని తీర్చాలి. వర్షపు నీటి సంరక్షణ అనేది మన ప్రాచీన ప్రజలు చేసే మంచి పద్ధతి. వాటితోనే మేం ఇక్కడ ఉన్న తాగునీటి సమస్యను తీరుస్తాం.

మహిళలకు భద్రత సమస్య. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మహిళల భద్రతకు ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా అలాంటి మార్పులు తీసుకొస్తాం. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ మొదటి స్థానంలో ఉంది.

మైనింగ్ ఒక సమస్య. మైనింగ్‌తో వచ్చే సంపద మన సమాజంలోకి తిరిగి రావడం లేదు. యువతకు ఉద్యోగాల సమస్య. వైద్యం, ఆరోగ్య సంరక్షణ సమస్య. గోవా మొత్తాన్ని పరిశీలిస్తే నాణ్యమైన విద్యను ఏర్పాటు చేయడం, యువతకు నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం, తద్వారా వారు మంచి ఉద్యోగాలు పొందడంతో ఇలాంటి సమస్యలు పూర్తిగా దూరమవుతాయి.

చేపలు పట్టడం కూడా ఓ సమస్యగా మారింది. మంచి క్రమబద్ధమైన పాలన అనేది ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. మా గ్రామం మత్స్యకారుల గ్రామం. గోవాలో రిజిస్టర్ అయిన బోట్ల ద్వారా చేపలు పట్టడం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో ఇక్కడు సమస్య ఏర్పడింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఫిషింగ్ బోట్లు ఇక్కడ నీటిలోని చేపలన్నింటినీ తీసుకెళ్తున్నాయి. స్థానిక మత్స్యకారులు రోజువారీ తిండిని కూడా కోల్పోయేలా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ స్థానిక మత్స్యకారులను, నీటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

గోవాలో పర్యాటకం ఒక సమస్యగా మారింది. అలాగే ఇక్కడ భద్రత కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. గోవాలో చాలా మంచి జీవన ప్రమాణాలు ఉన్నాయి. కొండలు, సముద్రం నగరం చూట్టూ ఉన్నాయి. ప్రతిదీ ఇక్కడ ఉంది. గోవాను నంబర్ వన్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చవచ్చని నేను భావిస్తున్నాను.

ఉద్యోగాలు సృష్టించడానికి క్రీడలు ఒక గొప్ప వాహనంగా మారాయి. క్రీడలలో 30 మిలియన్ల ఉద్యోగాలు ఉన్నాయి. నేను అందులో భాగమైనందుకు గర్వపడుతున్నాను. రాష్ట్రంలో మైనింగ్‌ను పెద్దఎత్తున పునఃప్రారంభించి, ఆ సంపదలో ఎక్కువ భాగం ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు, గోవా రుణాలను తీర్చుకునేందుకు, మిగులును వినియోగించి యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తాం.

ప్ర: మీరు గోవాలో టీఎంసీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. మీరు ఈ అవకాశాన్ని ఎలా చూస్తారు?

లియాండర్: నేను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం వైపు చూడటం లేదు. ఇప్పుడే నా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాను. నేను ప్రతిరోజూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఇంకా ఎదగాలి అని కోరుకుంటున్నాను. సుపరిపాలన పట్ల నా అభిరుచి ఎంతో లోతుగా ఉంది. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు, మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాను. నా కృషి, విలువలు, దేశభక్తి, అభిరుచిని నాతో తీసుకువెళతాను.

నాకు అవకాశాలు వస్తే చాలా నిజాయితీగా, సిన్సియర్‌గా చూస్తాను. గోవా సీఎం కావడం గురించి ఆలోచించడం లేదు. గోవా ప్రజల కోసం మంచి పని చేయడం, ప్రజల అభ్యున్నతి కోసం పని చేయడం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తాను. ఇది నాకు లభించే గొప్ప అవకాశం అవుతుంది. ప్రజలకు సాధ్యమైనంత వరకు సేవ చేయాలని కోరుకుంటున్నాను.

– సుమన్ రే ద్వారా

Also Read: 19 పరుగులకే 5 పెద్ద వికెట్లు కుప్పకూల్చాడు.. 34 ఏళ్ల వయసులో కూడా వాడి వేడి తగ్గలేదు..

Lalit Modi: క్రికెట్ గ్రౌండ్‎లో 30 యార్డ్స్ సర్కిల్‎ను కుదించాలి.. IPL‎ను‎ ప్రపంచమంతటికి తీసుకెళ్లాలి..