AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalit Modi: క్రికెట్ గ్రౌండ్‎లో 30 యార్డ్స్ సర్కిల్‎ను కుదించాలి.. IPL‎ను‎ ప్రపంచమంతటికి తీసుకెళ్లాలి..

టీ20 ఫార్మాట్‌లో ఐపీఎల్ గ్లోబల్ లీడర్‌గా కొనసాగడానికి సంస్కరణలు అవసరమని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ అన్నారు. ఫీల్డ్‌లోని 30 యార్డ్స్ సర్కిల్‎ను కుదించాలని సూచించారు...

Lalit Modi: క్రికెట్ గ్రౌండ్‎లో 30 యార్డ్స్ సర్కిల్‎ను కుదించాలి.. IPL‎ను‎ ప్రపంచమంతటికి తీసుకెళ్లాలి..
Ground
Srinivas Chekkilla
|

Updated on: Dec 18, 2021 | 12:56 PM

Share

టీ20 ఫార్మాట్‌లో ఐపీఎల్ గ్లోబల్ లీడర్‌గా కొనసాగడానికి సంస్కరణలు అవసరమని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ అన్నారు. ఫీల్డ్‌లోని 30 యార్డ్స్ సర్కిల్‎ను కుదించాలని సూచించారు. ఐపీఎల్‎ను అమెరికా, యూరప్, ఆఫ్రికాకు తీసుకెళ్లాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. దాని కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సభ్య దేశాల నుంచి ఆటగాళ్లను తప్పనిసరిగా ఎంచుకోవాలని ఫ్రాంచైజీలకు చెప్పాలని అతను కోరుతున్నారు. “ఐపీఎల్ తదుపరి స్థాయికి వెళ్లాలి. అది గాడిలో పడింది. నేను 2010లో భారత్ నుంచి నిష్క్రమించినప్పటి నుంచి ఎటువంటి ఆవిష్కరణలను చూడలేదు.” అని మోడీ న్యూస్ ఛానల్‎కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. “లీగ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. మేము IPLని సినిమాహాళ్లకు తీసుకెళ్లాము. మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి YouTubeతో టైఅప్ చేశాం.” అని 56 ఏళ్ల లలిత్ మోడీ నొక్కి చెప్పాడు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఫీల్డ్‌లోని సర్కిల్‎ను తగ్గించాలని మోడీ కోరుతున్నారు. ” IPL మరింత పెద్దదిగా మారాలి. 30 గజాల సర్కిల్ చిన్నదిగా మారాలి. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారు. రన్నింగ్ మెరుగుపడింది. మెరుగైన బౌలింగ్ జట్టు ఎల్లప్పుడూ ప్లేఆఫ్‌లకు చేరుకుంటుందని నేను నమ్ముతున్నాను.” అని ఆయన చెప్పారు. “ప్రజలు సిక్సర్‌లను కోరుకుంటారు, కానీ ఐపీఎల్ NBA (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) మార్గంలో వెళ్లాలని మేము కోరుకోము.” అని చెప్పారు. టోర్నమెంట్‌ను ఆదరించే అభిమానులను దృష్టిలో ఉంచుకుని, సాంకేతికతను మరింత ఉపయోగించాలని కోరారు. ” ప్రపంచం IPL ఆవిష్కరణలను కాపీ చేసి అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. BCCI ఇటీవల రెండు ఫ్రాంచైజీలను కొత్తగా చేర్చింది. 2022 IPL ఎడిషన్ నుంచి 10 జట్లు పోటీపడతాయి. టోర్నీకి 10 జట్లు సరైనవని” అని మోడీ అభిప్రాయపడ్డారు.

” నాకు టీవీలో అమెరికా, యూరప్, ఆఫ్రికా అంతటా IPL కావాలి. మీరు అక్కడి నుంచి ప్రతిభను పొంది ఆటను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లాలి. ICC 2024 ప్రపంచ కప్‌ను వెస్టిండీస్, USA నిర్వహిస్తోంది. ఇది చాలా కాలం క్రితమే జరిగి ఉండాలి.” అని చెప్పారు. అండర్ వరల్డ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోడి 2010 మేలో భారత్‌ను విడిచిపెట్టారు. 2022 నుంచి రెండు జట్లు చేరికతో ఫార్మాట్‌లో కూడా మార్పు వస్తుందన్నారు. టోర్నీ వ్యవధిని కూడా పొడిగించే అవకాశం ఉందని చెప్పారు. టోర్నీని నిర్ణీత వ్యవధికి మించి పొడిగిస్తే ప్రతిష్టంభన తప్పదని మోడి హెచ్చరిస్తున్నారు.

“ఐపీఎల్‌కు ఎల్లప్పుడూ ఆదర్శవంతమైన వ్యవధి 50 రోజులు. టోర్నమెంట్‌ను సాగదీయడం సాధ్యం కాదు, ఎందుకంటే ప్రీమియర్ లీగ్ లాగా ఆడకపోతే మ్యాచ్‌ల సంఖ్య దాదాపు 75 ఉంటుంది.” అని ఆయన చెప్పారు. 2022 నుండి IPL వ్యవధిని నిర్ణయించేటప్పుడు BCCI లోధా కమిటీ సిఫార్సు చేసిన, సుప్రీంకోర్టు ఆమోదించిన 15 రోజుల గ్యాప్‌ను గుర్తుంచుకోవాలన్నారు. 2008లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతుతో మోడీ ఐపీఎల్‌ను ప్రారంభించారు.

Read Also.. Ashwin: ఎవరు గొప్ప వికెట్ కీపర్.. చెప్పేసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్..