19 పరుగులకే 5 పెద్ద వికెట్లు కుప్పకూల్చాడు.. 34 ఏళ్ల వయసులో కూడా వాడి వేడి తగ్గలేదు..

Cricket News: టీ 20 మ్యాచ్‌లలో బ్యాటింగ్‌ మాయాజాలమే ఎక్కువగా ఉంటుందనే వారికి ఈ మ్యాచ్‌ గురించి చెప్పాలి. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు

19 పరుగులకే 5 పెద్ద వికెట్లు కుప్పకూల్చాడు.. 34 ఏళ్ల వయసులో కూడా వాడి వేడి తగ్గలేదు..
Seth Rance
Follow us
uppula Raju

|

Updated on: Dec 18, 2021 | 1:42 PM

Cricket News: టీ 20 మ్యాచ్‌లలో బ్యాటింగ్‌ మాయాజాలమే ఎక్కువగా ఉంటుందనే వారికి ఈ మ్యాచ్‌ గురించి చెప్పాలి. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు బౌలర్ల రాజ్యం నడుస్తోంది. అది ఏ ఫార్మాట్‌ అయినా బౌలర్లు తలుచుకుంటే వార్‌ వన్‌సైడ్‌ అయిపోతుంది. దానికి ఉదాహరణే ఈ మ్యాచ్‌ అని చెప్పవచ్చు. 34 ఏళ్ల బౌలర్ కేవలం 19 పరుగులకే 5 ప్రధాన వికెట్లను నేలకూల్చి జట్టుకు సులువుగా విజయాన్నందించాడు. అతడు ఎవరో కాదు రైట్ ఆర్మ్ బౌలర్ సేథ్ రాన్స్. సూపర్ స్మాష్ లీగ్‌లో తన విధ్వంసంతో బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.

సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, ఒటాగో మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ తరఫున గ్రెగ్ హే అత్యధికంగా 55 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇది కాకుండా వికెట్ కీపర్ డేన్ క్లీవర్ 45 పరుగులు చేయగా, కెప్టెన్ టామ్ బ్రూస్ 15 బంతుల్లో 26 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడారు. ఇప్పుడు ఒటాగోకు 181 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించారు. కానీ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల బౌలర్‌ సేథ్‌ రాన్స్‌, ఆరంభం నుంచి మెరుపు వేగంతో బంతులు విసిరాడు. ఫలితంగా ఒటాగో జట్టు పూర్తి 20 ఓవర్లు ఆడడం కష్టంగా మారింది.

జట్టు మొత్తం కేవలం 16.5 ఓవర్లలోనే 19 బంతులు మిగిలి ఉండగానే 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. 127 పరుగులకు ఆలౌట్ అయింది. 3.5 ఓవర్లలో సేథ్‌ రాన్స్19 పరుగులకు 5 గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌ పంపించాడు. ఈ 5 వికెట్లలో 4 వికెట్లు ఒటాగో టాప్ ఆర్డర్‌కు చెందినవి. సేథ్ రాన్స్ తన టీ20 కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లు తీసి అద్భుతాలు చేశాడు. అంతకుముందు 76 టీ20లు ఆడి 90 వికెట్లు సాధించగా ఇందులో రెండు సార్లు 4 వికెట్లు సాధించాడు.

2 రోజుల బ్యాంకు సమ్మె వల్ల 38 లక్షల చెక్కులు నిలిచిపోయాయి.. వేల కోట్ల పనులు ఆగిపోయాయి..

4 కొత్త ప్లాన్‌లు ప్రవేశపెట్టిన వొడాఫోన్‌ ఐడియా.. రూ.155కి అపరిమిత కాల్‌లు, అనేక ఫీచర్లు..

సల్మాన్‌తో ఎంట్రీ ఇచ్చినా జాతకం మారలేదు.. ఇండస్ట్రీకి దూరమై చాలా ఏళ్లవుతుంది.. ఈ రోజు ఆ బ్యూటీ బర్త్‌డే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!