AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..

KL Rahul: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు కేఎల్ రాహుల్ రూపంలో సమాధానం దొరికింది. భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు

KL Rahul: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..
Kl Rahul
uppula Raju
|

Updated on: Dec 18, 2021 | 2:04 PM

Share

KL Rahul: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు కేఎల్ రాహుల్ రూపంలో సమాధానం దొరికింది. భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టెస్టు జట్టుకు ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో అతడు ఈ పదవిలో కొనసాగుతాడు. తొడ ఎముక గాయంతో రోహిత్ దక్షిణాఫ్రికా సిరీస్‌కి దూరమయ్యాడు. అతడి నిష్క్రమణ తర్వాత అందరి ముందు మెదిలిన ప్రశ్న వైస్ కెప్టెన్‌ ఎవరని.. పలువురి పేర్లపై ఊహాగానాలు వచ్చాయి. కానీ చివరికి కేఎల్ రాహుల్ ఎంపికయ్యడు.

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు అజింక్య రహానే చాలా కాలం పాటు భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గత 12 నెలల్లో అతని పేలవమైన ఆట తీరు వైస్ కెప్టెన్సీని కూడా ప్రభావితం చేసింది. ఫలితంగా బీసీసీఐ అతడిని తొలగించి, ఈ ఏడాది టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీనిపై రోహిత్‌ శర్మ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ మూడు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది.

రోహిత్ శర్మ లేకపోవడంతో దక్షిణాఫ్రికాలో టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి KL రాహుల్ బలమైన పోటీదారు. దీనికి ప్రధాన కారణం జట్టులో అతనికి చోటు దక్కడం. టెస్టు సిరీస్‌లో భారత్‌కు మెరుగైన ఆరంభాన్ని అందించడంలో కేఎల్ రాహుల్ బాధ్యత వహిస్తాడు. అతని ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉంది, అతను దక్షిణాఫ్రికాలో కూడా దానిని కొనసాగించాలనుకుంటున్నాడు. కేఎల్ రాహుల్‌కు మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ భాగస్వామి ఉండవచ్చు. అయితే ఈ మ‌ధ్యే బెంగుళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ శర్మ దాని నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జనవరి 19, 2022 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు రోహిత్ దక్షిణాఫ్రికా చేరుకుంటాడు.

19 పరుగులకే 5 పెద్ద వికెట్లను కుప్పకూల్చాడు.. 34 ఏళ్ల వయసులో కూడా వాడి వేడి తగ్గలేదు..

2 రోజుల బ్యాంకు సమ్మె వల్ల 38 లక్షల చెక్కులు నిలిచిపోయాయి.. వేల కోట్ల పనులు ఆగిపోయాయి..

4 కొత్త ప్లాన్‌లు ప్రవేశపెట్టిన వొడాఫోన్‌ ఐడియా.. రూ.155కి అపరిమిత కాల్‌లు, అనేక ఫీచర్లు..