Watch Video: ద్రవిడ్ వర్సెస్ విరాట్ కోహ్లీ.. గెలుపెవరిదో తెలుసా? వీడియో..

Indian Cricket Team: ప్రాక్టీస్ సెషన్‌లో జట్టు చాలా సేపు ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. ఆట సమయంలో ద్రవిడ్, కోహ్లీ ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం చాలాసార్లు కనిపించింది.

Watch Video: ద్రవిడ్ వర్సెస్ విరాట్ కోహ్లీ.. గెలుపెవరిదో తెలుసా? వీడియో..
Bcci Viral Video
Follow us

|

Updated on: Dec 18, 2021 | 5:45 PM

IND vs SA: టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా దక్షిణాఫ్రికా చేరుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్నారు. బీసీసీఐ, కోహ్లి మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి కనిపించాడు. అతను తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. కోచ్ ద్రవిడ్‌తో చాలా సరదాగా గడిపాడు.

ద్రవిడ్‌తో కలిసి కోహ్లీ సరదాగా.. ప్రాక్టీస్ సెషన్‌లో జట్టు చాలా సేపు ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. ఆట సమయంలో ద్రవిడ్, కోహ్లీ ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం చాలాసార్లు కనిపించింది. అంతే కాదు ద్రవిడ్, విరాట్ జట్ల మధ్య మ్యాచ్ కూడా జరిగింది. అయితే ఈ మ్యాచులో ఎవరు గెలిచారో తెలియలేదు. సరదాగా సాగిన ఈ మ్యాచులో మధ్యలో చిన్నపాటి ఫన్నీ వైరం కూడా కనిపిస్తోంది.

త్వరలో ప్రాక్టీస్ ప్రారంభం.. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ మాట్లాడుతూ – మేం 3 రోజులు ముంబైలో కఠినమైన నిర్బంధంలో ఉన్నాం. 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత ఇక్కడకు చేరుకున్నాం. మళ్లీ ఒక రోజు క్వారంటైన్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఆటగాళ్లు రన్నింగ్‌తోపాటు స్కిల్స్‌పై కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుంది. ఇది ఆటపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది’ అని తెలిపాడు.

ఇంతకీ ఏం జరిగింది..? దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మను వన్డే, టీ20ఐ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం విరాట్ టెస్టు కమాండ్ మాత్రమే తీసుకుంటాడు. అయితే, రోహిత్‌ని కెప్టెన్‌గా నియమించిన తర్వాత, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కోహ్లి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని, వన్డే సిరీస్‌కు కూడా విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. జట్టులో కోహ్లీ-రోహిత్ మధ్య వివాదం జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే, దక్షిణాఫ్రికా చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లీ సహచరులతో సరదాగా గడిపిన తీరు ప్రస్తుతం జట్టులో అంతా బాగానే ఉందని స్పష్టంగా తెలియజేస్తోంది.

Also Read: KL Rahul: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..

19 పరుగులకే 5 పెద్ద వికెట్లు కుప్పకూల్చాడు.. 34 ఏళ్ల వయసులో కూడా వాడి వేడి తగ్గలేదు..