2 రోజుల బ్యాంకు సమ్మె వల్ల 38 లక్షల చెక్కులు నిలిచిపోయాయి.. వేల కోట్ల పనులు ఆగిపోయాయి..

Bank Strike: ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె శుక్రవారంతో ముగిసింది. అయితే ఈ రెండు రోజుల బ్యాంకు సమ్మెలో అనేక బ్యాంకింగ్

2 రోజుల బ్యాంకు సమ్మె వల్ల 38 లక్షల చెక్కులు నిలిచిపోయాయి.. వేల కోట్ల పనులు ఆగిపోయాయి..
Bank Strike
Follow us

|

Updated on: Dec 18, 2021 | 1:21 PM

Bank Strike: ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె శుక్రవారంతో ముగిసింది. అయితే ఈ రెండు రోజుల బ్యాంకు సమ్మెలో అనేక బ్యాంకింగ్ పనులు నిలిచిపోయాయి. రెండు రోజుల సమ్మెలో చెక్‌ క్లియరెన్స్‌ రాకపోవడంతో దాదాపు 37 వేల కోట్ల రూపాయల పనులు ఆగిపోయాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా డిసెంబర్ 16, 17 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజుల్లో దాదాపు 38 లక్షల చెక్కుల చెల్లింపులు జరగలేదు.

బ్యాంకుల బంద్ కారణంగా డిపాజిట్, విత్ డ్రా, చెక్కు క్లియరింగ్, లోన్ అప్రూవల్ వంటి సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు వ్యాపారులు కూడా చాలా నష్టపోయారు. ప్రస్తుతం దేశంలోని మూడు నగరాలు, ఢిల్లీ, ముంబై, చెన్నైలలో చెక్ క్లియరెన్స్ కేంద్రాలు ఉన్నాయి. చెన్నైలో దాదాపు రూ.10,600 కోట్ల విలువైన 10 లక్షల చెక్కులు క్లియర్ కాలేదు. అదేవిధంగా ముంబైలో 18 లక్షల చెక్కులు క్లియర్ కాలేదు. అంటే దాదాపు రూ.15,400 కోట్లు.

అదే సమయంలో ఢిల్లీలో రెండు రోజుల సమ్మె కారణంగా రూ.11 వేల కోట్ల విలువైన సుమారు 11 లక్షల చెక్కులు క్లియర్ కాలేదు. బ్యాంకు సమ్మె తొలిరోజు గురువారం రూ.18,600 కోట్ల విలువైన 20.4 లక్షల చెక్కుల లావాదేవీలు జరగలేదు. విశేషమేమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె కారణంగా తమ శాఖలలోని సేవలు ప్రభావితం కావచ్చని ఇప్పటికే ఖాతాదారులకు తెలియజేశాయి. అయినప్పటికీ, ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లలో పని యథావిధిగా కొనసాగింది. అయితే బ్యాంకు చెక్కుల క్లియరింగ్‌ మాత్రం జరగలేదు.

4 కొత్త ప్లాన్‌లు ప్రవేశపెట్టిన వొడాఫోన్‌ ఐడియా.. రూ.155కి అపరిమిత కాల్‌లు, అనేక ఫీచర్లు..

సల్మాన్‌తో ఎంట్రీ ఇచ్చినా జాతకం మారలేదు.. ఇండస్ట్రీకి దూరమై చాలా ఏళ్లవుతుంది.. ఈ రోజు ఆ బ్యూటీ బర్త్‌డే..?

SSC exam క్యాలెండర్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకోండి..