4 కొత్త ప్లాన్‌లు ప్రవేశపెట్టిన వొడాఫోన్‌ ఐడియా.. రూ.155కి అపరిమిత కాల్‌లు, అనేక ఫీచర్లు..

Vodafone Idea: Viతో సహా Reliance Jio, Airtel ఇటీవల ధరల పెంపును ప్రకటించాయి. కానీ ఇప్పుడు Vi కొన్ని కొత్త ప్లాన్‌లను ప్రకటించింది.

4 కొత్త ప్లాన్‌లు ప్రవేశపెట్టిన వొడాఫోన్‌ ఐడియా.. రూ.155కి అపరిమిత కాల్‌లు, అనేక ఫీచర్లు..
Vodafone Idea
Follow us

|

Updated on: Dec 18, 2021 | 11:31 AM

Vodafone Idea: Viతో సహా Reliance Jio, Airtel ఇటీవల ధరల పెంపును ప్రకటించాయి. కానీ ఇప్పుడు Vi కొన్ని కొత్త ప్లాన్‌లను ప్రకటించింది. ఇందులో చౌకైన ప్లాన్ రూ.155. ఇది వినియోగదారులకు అపరిమిత కాల్‌లు, 24 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అలాగే వినియోగదారులు ఏకకాలంలో రెండు సిమ్‌లను రన్ చేస్తే ఈ ప్లాన్ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త రీఛార్జ్ కింద రూ.155, రూ.239, రూ.666, రూ.699 ప్లాన్లను ప్రవేశపెట్టారు. వాటి గురించి తెలుసుకుందాం.

Vi రూ. 155 ప్రీపెయిడ్ ప్లాన్ Vi రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 24 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్, 300 SMSలను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌లో వినియోగదారులు1 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వినియోగదారులకు కాల్ చేయడానికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది.

Vi రూ. 239 ప్రీపెయిడ్ ప్లాన్ Vi రూ. 239కి ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు రూ.155 ప్లాన్ వలె 24 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అలాగే ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఇందులో వినియోగదారులు రోజువారీ 100SMS కూడా పొందుతారు.

Vi రూ 666 ప్రీపెయిడ్ ప్లాన్ Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లో రూ.666 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 77 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. దీర్ఘకాలిక రీఛార్జ్ చేయాలనుకునేవారికి ఇది ప్రత్యేకమైన ప్లాన్. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, రోజువారీ 1.5 GB ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా బింగే ఆల్ నైట్, డేటా డిలైట్ ఆఫర్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

Vi రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ Vi రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉంది. దీని కింద వినియోగదారులు ప్రతిరోజూ 3 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, ప్రతిరోజూ 100 SMSలను పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇతర ప్రయోజనాల గురించి చెప్పాలంటే ఇందులో డేటా రోల్‌ఓవర్, బింజ్ ఓవర్‌నైట్, డేటా డిలైట్ ఆఫర్, Vi సినిమాలు, టీవీకి ఉచిత యాక్సెస్ ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో Vi ఇటీవల హంగామా మ్యూజిక్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని సహాయంతో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఆరు నెలల పాటు హంగామా ప్రీమియం సభ్యత్వాన్ని పొందుతారు.

సల్మాన్‌తో ఎంట్రీ ఇచ్చినా జాతకం మారలేదు.. ఇండస్ట్రీకి దూరమై చాలా ఏళ్లవుతుంది.. ఈ రోజు ఆ బ్యూటీ బర్త్‌డే..?

SSC exam క్యాలెండర్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకోండి..

UPSC NDA 2021 రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా తెలుసుకోండి..