AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC NDA 2021 రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా తెలుసుకోండి..

UPSC NDA,,NA Result 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నావల్ అకాడమీ ఎగ్జామినేషన్

UPSC NDA 2021 రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా తెలుసుకోండి..
Indian Army
uppula Raju
|

Updated on: Dec 18, 2021 | 9:35 AM

Share

UPSC NDA,,NA Result 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (NA) తుది ఫలితాలను ప్రకటించింది. UPSC NDA NA I ఫలితం 2021 మెరిట్ జాబితాతో విడుదల అయింది. ఈసారి 517 మంది అభ్యర్థులు మెరిట్ జాబితాలో అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఫలితాలను చూసుకోవచ్చు. రాత పరీక్ష ఏప్రిల్ 18, 2021న నిర్వహించారు. ఆ తర్వాత అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌కు షార్ట్‌లిస్ట్‌కి ఎంపికయ్యారు.

ఎలా తనిఖీ చేయాలి..? అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. హోమ్‌పేజీలో ‘NDA తుది ఫలితం, NA I 2021’ అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. PDF ఫైల్‌తో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అర్హత గల అభ్యర్థుల జాబితాలో మీ పేరును కనుగొనడానికి స్క్రోల్ చేయండి తెలిసిపోతుంది. అభ్యర్థులకు ఏవైనా అనుమానాలు ఉంటే UPSCని 011-23385271/011-2338125/011-23098543 నంబర్‌కి ఫోన్ చేయగలరు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎప్పుడైనా సంప్రదించవచ్చు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగ్ కోసం NDA 148వ కోర్సు 02 జూలై 2022 నుంచి ప్రారంభమవుతుంది. 110వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (INAC) రిక్రూట్‌మెంట్ చేస్తోంది. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అటువంటి అభ్యర్థులు రిజల్ట్ ప్రకటించిన రెండు వారాల్లోగా ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ joinindianarmy.nic.inలో తమను తాము ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. విజయం సాధించిన అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు, SSB ఇంటర్వ్యూ కోసం తేదీలు ప్రకటిస్తారు.

కరోనా కాలంలో ప్రజలు ఇళ్లు, కార్లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు..! కారణం ఏంటో తెలుసా..?

E-shram కార్డ్‌తో ప్రయోజనాలేంటి..? ఇది ఎలా పొందాలి.. దీనికి ఎవరు అర్హులు తెలుసుకోండి..

Omicron ముప్పు మధ్య వ్యాక్సిన్‌పై శుభవార్త..! WHO Covovaxని గుర్తించింది..