E-shram కార్డ్‌తో ప్రయోజనాలేంటి..? ఇది ఎలా పొందాలి.. దీనికి ఎవరు అర్హులు తెలుసుకోండి..

E-Shram Card: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు

E-shram కార్డ్‌తో ప్రయోజనాలేంటి..? ఇది ఎలా పొందాలి.. దీనికి ఎవరు అర్హులు తెలుసుకోండి..
E Shram
Follow us
uppula Raju

|

Updated on: Dec 18, 2021 | 8:25 AM

E-Shram Card: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఈ-శ్రమ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వారికి అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం కూలీలకు ఈ-శ్రమ్ కార్డులు అందజేస్తున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి సులభంగా ఉపాధి పొందే అవకాశాలను చూపుతున్నారు.

ఈ-శ్రమ్ కార్డ్ అంటే ఏమిటి ఈ-శ్రమ్ కార్డ్ అనేది కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు. ఇది కార్మికుడు అసంఘటిత రంగంలోని వాడని రుజువు చేస్తుంది. ఇప్పుడు కార్మికులు తమ ప్రయోజనాలను పొందేందుకు పెద్దగా పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. దీన్ని చూపించడం లేదా సమర్పించడం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలు అందుతాయి.

ఈ-శ్రమ్ కార్డ్ ప్రయోజనాలు ఏమిటి ఈ-శ్రమ్ కార్డు పొందిన కూలీలు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందడం సులభం అవుతుంది. డేటాబేస్‌లో వారికి సంబంధించిన డేటా వల్ల వారు పనిని సులభంగా పొందుతారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. పోర్టల్‌లో నమోదైన కార్మికుడు ప్రమాదానికి గురైతే, మరణం లేదా పూర్తి అంగవైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షల మొత్తం ఇస్తారు. అదే సమయంలో కార్మికుడు పాక్షికంగా అంగవైకల్యం కలిగి ఉంటే ఈ బీమా పథకం కింద లక్ష రూపాయలకు అర్హులు.

ఈ కార్డు సహాయంతో అసంఘటిత రంగ కార్మికులకు ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్ పథకం, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జాతీయ ప్రభుత్వ పథకాలైన సామాజిక సహాయ పథకం, ఆయుష్మాన్ భారత్, నేత కార్మికులకు ఆరోగ్య పథకం, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం వంటి వాటి ద్వారా ప్రయోజనం పొందుతారు.

నమోదు ప్రక్రియ, షరతులు ఏమిటి అసంఘటిత రంగంలో పనిచేసే 16 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. వర్కర్ స్వయంగా లేదా ఈ-శ్రమ్ పోర్టల్ https://eshram.gov.in/ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదు పూర్తిగా ఉచితం. కార్మికులు పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు.

ఏ పత్రాలు అవసరమవుతాయి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం, కార్మికులు పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత, నైపుణ్యం వంటి సమాచారాన్ని అందించాలి. మీరు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన వెంటనే అక్కడ ఉన్న డేటాబేస్ నుంచి వర్కర్ మొత్తం సమాచారం పోర్టల్‌లో స్వయంచాలకంగా కనిపిస్తుంది. వ్యక్తి మిగిలిన అవసరమైన సమాచారాన్ని పూరించాలి. కార్మికుడు ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్. బ్యాంక్ ఖాతా అవసరం ఒక కార్మికుడికి ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ లేకపోతే, అతను/ఆమె సమీపంలోని CSCని సందర్శించి బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

Omicron ముప్పు మధ్య వ్యాక్సిన్‌పై శుభవార్త..! WHO Covovaxని గుర్తించింది..

చలికాలంలో డ్రైఫ్రూట్స్‌ తినండి.. కానీ మితిమీరితే శరీరానికి హాని.. ఎలాగో తెలుసా..?

కాలం మారింది.. పొదుపు పథకాలలో బదులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌.. ఎందుకంటే..?

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..