CCI: అమెజాన్‎కు షాక్ ఇచ్చిన సీసీఐ.. ‘ఫ్యూచర్ డీల్’ అనుమతుల రద్దుతో పాటు రూ.202 కోట్ల ఫైన్..

అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది...

CCI: అమెజాన్‎కు షాక్ ఇచ్చిన సీసీఐ.. 'ఫ్యూచర్ డీల్' అనుమతుల రద్దుతో పాటు రూ.202 కోట్ల ఫైన్..
Amazon
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 18, 2021 | 7:01 AM

అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్‌తో 2019 ఒప్పందంపై అమెజాన్‌కు ఇచ్చిన ఆమోదాన్ని CCI నిలిపివేసింది. రెగ్యులేటర్ నుండి అనుమతి తీసుకునేటప్పుడు అమెజాన్ ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. దీంతో పాటు అమెజాన్‌పై కమీషన్ 200 కోట్ల రూపాయల పెనాల్టీని కూడా విధించింది.

ఒప్పందం వెనుక ఉన్న అసలు ఉద్దేశం అమెజాన్ వెల్లడించలేదని సీసీఐ పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, డీల్‌ను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అప్పటి వరకు ఒప్పందం కోసం ఇచ్చిన ఆమోదం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు అమెజాన్‌పై రూ.200 కోట్ల జరిమానా కూడా విధించింది. ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఫ్యూచర్ రిటైల్‌ను పరోక్షంగా ప్రభావితం చేసే ఉద్దేశాన్ని అమెజాన్ దాచిపెట్టిందని ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అమెజాన్‌పై ఫిర్యాదు చేశాయి. ఈ విషయంపై స్పందించాల్సిందిగా అమెజాన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన రెండు వారాల తర్వాతసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేసింది. ఇందుకోసం 2019లో ఫ్యూచర్ గ్రూప్‌తో రూ.1431 కోట్ల డీల్ కుదుర్చుకుంది. ఫ్యూచర్ రిటైల్‌లో 10 శాతం ఫ్యూచర్ కూపన్‌లు కలిగి ఉన్నాయి. ఈ డీల్ సమయంలో, ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని అమెజాన్ అనుమతి లేకుండా మరే ఇతర పార్టీకి విక్రయించరాదని రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే, 2020లో, కిషోర్ బియానీ ఈ వ్యాపారాన్ని రిలయన్స్‌కు రూ. 24500 కోట్లకు విక్రయించారు. ఆ తర్వాత అమెజాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. దీని కారణంగా ఇరుపక్షాలు సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్నాయి.

Read Also.. Gold and Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధర.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?