Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Festival Offer: కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఎస్బీఐ అందిస్తున్న వడ్డీ రాయితీ..(వీడియో)

SBI Festival Offer: కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఎస్బీఐ అందిస్తున్న వడ్డీ రాయితీ..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 18, 2021 | 8:40 AM

దసరా పండుగ వస్తోంది. చాలామంది కారు కొనాలని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కార్ల డీలర్లు సైతం మంచి మంచి ఆఫర్లు ఇస్తారు. పండుగ సీజన్ లో కారు కొనడం చౌకైనదిగా ఉంటుంది. మీరూ..

దసరా పండుగ వస్తోంది. చాలామంది కారు కొనాలని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కార్ల డీలర్లు సైతం మంచి మంచి ఆఫర్లు ఇస్తారు. పండుగ సీజన్ లో కారు కొనడం చౌకైనదిగా ఉంటుంది. మీరూ.. ఈ పండుగ సీజన్‌లో కారు కొనాలని ఆలోచిస్తుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మీ కోసం ప్రత్యేక ఆఫర్‌ని అందించింది. ఎస్బీఐ కార్ లోన్ వడ్డీ రేటుపై డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది.

ఎస్బీఐ చెబుతున్న దాని ప్రకారం, యోనో యాప్ బెనిఫిట్ ప్లాన్ నుండి దరఖాస్తు చేసుకోవడం ద్వారా వడ్డీ రాయితీ లభిస్తుంది. కస్టమర్ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, అతనికి లేదా ఆమెకు 0.50శాతం వడ్డీ రేటు తగ్గిస్తారు. ఇది కాకుండా, కస్టమర్ ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ కారు యొక్క ఆన్ -రోడ్ ధరలో 90శాతం వరకు రుణాలను అందిస్తోంది. ఎస్బీఐ కార్ల రుణం 7.75శాతం నుండి ప్రారంభమవుతుంది. కానీ మీరు ఈ ఆఫర్ కింద రుణం తీసుకుంటే, మీకు 7.25శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మీరు 3 నుండి 7 సంవత్సరాల కాలపరిమితితో రుణం తీసుకోవచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ : PM Kisan FPO Yojana: రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్‌.. చేరితే రూ. 15లక్షలు.!(వీడియో)

 Rajiv Assassination Witness Philip: రాజీవ్‌ హత్యకేసు ప్రత్యక్షసాక్షి ఫిలిప్‌.. నాటి అనుభవం పుస్తకంగా తెస్తా..!(వీడియో)

 smart watch saves a person: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రాణం పోసిన స్మార్ట్ వాచ్..!(వీడియో)

 Amazon offer On One Plus: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 3 వేల తగ్గింపులో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు..!(వీడియో)

Published on: Dec 18, 2021 08:07 AM