SBI OFFER: ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..! తనఖా పెట్టిన నివాస, వాణిజ్య ఆస్తుల వేలం.. (వీడియో)
సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా... అయితే ఈ న్యూస్ మీ కోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం భారీ ఆఫర్‌తో తీసుకొచ్చింది. ఖరీదైన ఆస్తులను చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా… అయితే ఈ న్యూస్ మీ కోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం భారీ ఆఫర్‌తో తీసుకొచ్చింది. ఖరీదైన ఆస్తులను చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. బ్యాంక్‌లో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 25 న వాణిజ్య, నివాస స్థలాల కోసం ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తోంది. వేలానికి సంబంధించి ఓ ప్రకటనను ఎస్‌బీఐ విడుదల చేసింది. వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసులో ఇతర అన్ని వివరాలను పేర్కొంది. అయితే SBI ఇచ్చిన ప్రకటన ప్రకారం.. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తుల వేలం కోర్టు అనుమతి తర్వాతే జరుగుతుంది.
బ్యాంకు ప్రజలకు రుణాలు ఇచ్చేముందు గ్యారెంటీ రూపంలో వారికి సంబంధించిన ఆస్తులను తనఖా పెట్టుకుంటుంది. రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే బ్యాంక్ తన తనఖా ఆస్తిని రికవరీ కోసం వేలం వేస్తుంది. బ్యాంకు సంబంధిత శాఖలు వార్తాపత్రికలు ఇతర మాధ్యమాల ద్వారా ప్రకటనలను ప్రచురిస్తాయి. ఆస్తుల వేలానికి సంబంధించిన సమాచారం ఈ ప్రకటనలో ఇస్తారు. SBI నిర్వహించే ఇ-వేలంలో పాల్గొనాలంటే నోటీసులో ఇచ్చిన సంబంధిత ఆస్తి కోసం EMD సమర్పించాలి. ‘KYC డాక్యుమెంట్లు’ సంబంధిత బ్యాంక్ శాఖలో చూపించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనే వ్యక్తి తప్పనిసరిగా డిజిటల్ సంతకాన్ని కలిగి ఉండాలి. లేకపోతే, ఇ-వేలం నిర్వహించే వ్యక్తి లేదా ఏదైనా ఇతర అధీకృత ఏజెన్సీని దీని కోసం సంప్రదించవచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

