PM Kisan FPO Yojana: రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్‌.. చేరితే రూ. 15లక్షలు.!(వీడియో)

PM Kisan FPO Yojana: రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్‌.. చేరితే రూ. 15లక్షలు.!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 07, 2021 | 9:59 PM

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల స్కీమ్‌లను అందిస్తోంది. ఇప్పటికే ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన మోడీ సర్కార్‌.. రైతుల కోసం మరో స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల స్కీమ్‌లను అందిస్తోంది. ఇప్పటికే ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన మోడీ సర్కార్‌.. రైతుల కోసం మరో స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అదే పీఎం కిసాన్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ యోజన…ఈ పథకం ద్వారా రూ.15 లక్షలు అందించనుంది.

కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించింది. అయితే ఈ స్కీమ్‌లో ఎలా చేరాలో, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తదితర పూర్తి వివరాలు చాలా మందికి తెలియవు. ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ స్కీమ్‌ కింద 15 లక్షలు పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాల్సి ఉంటుంది. ఈ పథకం పొందడం ద్వారా వచ్చే డబ్బులను విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలు రైతులకు విక్రయించుకోవచ్చు. అయితే దీనిలో చేరేందుకు రైతులు వేచి చూడక తప్పదు.

ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం 2023-24 నాటికి 10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటికి సాయం అందిస్తుంది. ఒక్కో స్కీమ్‌కు మోదీ ప్రభుత్వం 15 లక్షల రుణంగా అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించవచ్చు. ఇలాంటి పథకం ద్వారా రైతులు మరింతగా ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే 2024 నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ కోసం దాదాపు 6వేల 865 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. 
మరిన్ని చదవండి ఇక్కడ : Rajiv Assassination Witness Philip: రాజీవ్‌ హత్యకేసు ప్రత్యక్షసాక్షి ఫిలిప్‌.. నాటి అనుభవం పుస్తకంగా తెస్తా..!(వీడియో)

 smart watch saves a person: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రాణం పోసిన స్మార్ట్ వాచ్..!(వీడియో)

 Amazon offer On One Plus: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 3 వేల తగ్గింపులో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు..!(వీడియో)

 CM KCR speech Video: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే.. ఊరుకోం.. పోరాడతాం.. సీఎం కేసీఆర్..(లైవ్ వీడియో)