Gold and Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధర.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Price Today: దేశీయంగా బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి.
Gold and Silver Price Today: దేశీయంగా బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి. భారతీయులు ఏ చిన్న సందర్భం వచ్చినా వెంటనే బంగారం నగలు కొనుగోలు పై ఆసక్తిని చూపిస్తారు. వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి వస్తువులను ఖరీదు చేయాలనుకుంటారు. అయితే గత కొంతకాలంగా బంగారం కొనుగోలుని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండి పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే పసిడి ధరలు రోజు రోజుకీ పైపైకి పెరుగుతున్నాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ఆల్ టైం హై కి చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో నేటి బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ గ్రాము ధర శుక్రవారం రూ. 4,942లు ఉండగా శనివారం ఉదయానికి రూ43 లు పెరిగి ఈరోజు రూ.4,985లకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.49,420 లు ఉంది. అయితే ఈరోజు రూ. 430 లు మేర పెరగడంతో డిసెంబర్ 18వ తేదీ శనివారం ఉదయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850లు గా నమోదైంది.
ఇక నగలకు ఉపయోగించే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర శుక్రవారం రూ. 4,530 లు ఉండగా ఈరోజు ఉదయానికి (డిసెంబర్ 18వ తేదీ శనివారం ఉదయానికి) రూ.40 మేర పెరిగింది. దీంతో ఈరోజు గ్రాము బంగారం ధర రూ. 4,570లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 10గ్రాముల బంగారం ధర గురువారం రూ. 45,300ఉండగా.. నేడు రూ. 300 మేర పెరిగి రూ. 45,700 లకు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు: పశ్చిమ బెంగాల్ రాజధాని, మహానగరం కోల్‌కతాలో బంగారం ధర 10 గ్రాములకు రూ.50,650గా ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.50,120గా ఉంది.
వెండి ధరలు: మన దేశంలో బంగారం తర్వాత ఖరీదు చేసే లోహం వెండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా బహుమతులు ఇవ్వడానికి వెండి వస్తువులను ఎంపిక చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మనదేశంలో కిలో వెండి ధర ఎలా ఉన్నదంటే.. శుక్రవారం కిలో వెండి ధర రూ. 61,400 లు ఉండగా ఈరోజు ఉదయానికి రూ.700 మేర పెరిగి 62,300 లకు చేరుకుంది.
Read Also.. TVS NTorq 125: టీవీఎస్ నుంచి సరికొత్త స్కూటర్లు విడుదల.. యువతను ఆకర్షించే విధంగా తయారు..!