- Telugu News Photo Gallery Business photos New TVS NTorq 125 SuperSquad Edition variants launched: Check price, features
TVS NTorq 125: టీవీఎస్ నుంచి సరికొత్త స్కూటర్లు విడుదల.. యువతను ఆకర్షించే విధంగా తయారు..!
TVS NTorq 125: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. ఇక తాజాగా టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ స్వ్కాడ్ ఎడిషన్ కింద స్పైడర్ మ్యాన్, థార్ ఇన్‌స్పైర్డ్ ..
Updated on: Dec 17, 2021 | 9:33 PM

TVS NTorq 125: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. ఇక తాజాగా టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ స్వ్కాడ్ ఎడిషన్ కింద స్పైడర్ మ్యాన్, థార్ ఇన్‌స్పైర్డ్ వేరియంట్లలో స్కూటర్లను విడుదల చేసింది కంపెనీ.

ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంధర్, కెప్లెన్ అమెరికా వేరియంట్లలో ఈ ఎడిషన్ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.84,850గా నిర్ణయించింది కంపెనీ. ఈ స్కూటర్‌లో ఎన్నో ఫీచర్స్‌ను పొందుపరిచింది.

రెండు కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ స్వ్కాడ్ ఎడిషన్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. నేటి యువతకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకువచ్చిన కంపెనీ తెలిపింది.

ఈ కొత్త వేరియంట్ స్కూటర్లు కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తాయని కంపెనీ భావిస్తోంది. 124.8 సీసీ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.





























