Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలం మారింది.. పొదుపు పథకాలలో బదులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌.. ఎందుకంటే..?

People Investing: ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాల పట్ల ప్రజల ఆసక్తి తగ్గుతోంది. దీనికి బదులు డీమ్యాట్ ఖాతాలను ఓపెన్‌ చేస్తున్నారు.

కాలం మారింది.. పొదుపు పథకాలలో బదులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌.. ఎందుకంటే..?
Savings
Follow us
uppula Raju

|

Updated on: Dec 17, 2021 | 2:18 PM

People Investing: ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాల పట్ల ప్రజల ఆసక్తి తగ్గుతోంది. దీనికి బదులు డీమ్యాట్ ఖాతాలను ఓపెన్‌ చేస్తున్నారు. దేశంలోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాలు, నగరాల వరకు ప్రజలు ఇప్పుడు చిన్న పొదుపు పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టడం లేదు. దీనికి బదులుగా డీమ్యాట్ ఖాతాలను ఓపెన్ చేసి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రమాదకర ప్రదేశాలలో డబ్బు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.

గణాంకాలు ఏం చెబుతున్నాయి? వాస్తవానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో చిన్న పొదుపు పథకాలకు సంబంధించిన వివరాల గురించి తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2018-19 సంవత్సరంలో చిన్న పొదుపు పథకాల కొత్త ఖాతాల సంఖ్య 4.66 కోట్లు. మరుసటి సంవత్సరం అంటే 2019-20లో ఈ సంఖ్య 4.12 కోట్లకు తగ్గగా, ఆ తర్వాత 2020-21లో ఈ సంఖ్య 4.11 కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ వరకు 2.33 కోట్ల చిన్న మొత్తాల పొదుపు పథకాల ఖాతాలు మాత్రమే ఓపెన్ చేశారు.

మరోవైపు డీమ్యాట్ గురించి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల 7 నెలల్లో వాటి సంఖ్య రెండింతలకు పైగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. లెక్కల ప్రకారం చూస్తే, 2018-19లో దేశంలో మొత్తం 3.59 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. మరుసటి సంవత్సరం ఈ సంఖ్య 4.06 కోట్లకు పెరిగింది, 2020-21లో ఈ సంఖ్య 5.51 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి ఈ సంఖ్య 7.38 కోట్లకు చేరడం విశేషం. అదే సమయంలో 31 ​​అక్టోబర్ 2021 నాటికి దేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 2.75 కోట్లకు చేరుకుంది. ఇదొక్కటే కాదు సెబీ వద్ద నమోదు చేసుకున్న పెట్టుబడి సలహాదారుల (RIA) సంఖ్య కూడా 1,324 కి చేరుకుంది.

చిన్న పొదుపు పథకాలపై ఆసక్తి ఎందుకు తగ్గుతోంది? చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణం వడ్డీ రేట్ల తగ్గింపు. ఈ పథకాలపై వడ్డీ రేట్లు నిరంతరం తగ్గుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో సాధారణ పెట్టుబడిదారుల ఆసక్తి వాటిపై తగ్గుతోంది. మరోవైపు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రజలు మంచి రాబడిని పొందుతున్నారు. దీంతో ప్రజలు వాటి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.నిఫ్టీ, సెన్సెక్స్ గత మూడేళ్లలో 60% వరకు రాబడిని ఇచ్చాయి. మరోవైపు, చిన్న పొదుపు పథకాలు గరిష్టంగా 8% వార్షిక రాబడిని అందిస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో అందుతున్న రాబడులు ప్రజలను తమవైపు ఆకర్షిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Indian Railways: ఏసీ కోచ్‌లు రైలు మధ్యలో.. అదే జనరల్‌ బోగీలు ముందు లేదా వెనకాల.. కారణం ఏంటో తెలుసా..?

ఇంటర్‌ తర్వాత ఈ కోర్సు చేస్తే త్వరగా జాబ్‌.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మెరుగైన అవకాశాలు..

రోజుకు 20 రూపాయలు డిపాజిట్‌ చేస్తే కోటీశ్వరులు కావొచ్చు.. డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి