Omicron ముప్పు మధ్య వ్యాక్సిన్‌పై శుభవార్త..! WHO Covovaxని గుర్తించింది..
Covovax: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవావాక్స్ లైసెన్స్‌తో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
Covovax: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవావాక్స్ లైసెన్స్‌తో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తయారు చేసిన యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవోవాక్స్’ని తన అత్యవసర వినియోగ జాబితాలో చేర్చింది. ఈ విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన టీకాల సంఖ్య పెరిగింది. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో డబ్ల్యూహెచ్‌ఓ తీసుకున్న ఈ నిర్ణయం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) మరో మైలురాయిగా సీఈఓ అదార్ పూనావాలా అభివర్ణించారు.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తక్కువ-ఆదాయ దేశాలలో ఈ టీకా సహాయం చేస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించే ప్రక్రియలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా తనిఖీ డేటా ఆధారంగా మాత్రమే ఈ వ్యాక్సిన్ ఆమోదించారు. ట్రయల్స్ సమయంలో అద్భుతమైన డేటా లభించినందున ఈ టీకా మూడేళ్లలోపు పిల్లలకు రక్షణ కల్పిస్తుందని సీరమ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్‌కు భారతదేశంలో ఇంకా ఆమోదం లభించలేదు. WHO 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు కూడా ఆమోదించింది.
పూనావాలా మాట్లాడుతూ.. “కోవిడ్ -19కి వ్యతిరేకంగా మా పోరాటంలో ఇదొక మరొక మైలురాయి. అత్యవసర ఉపయోగం కోసం కోవోవాక్స్‌ని ఇప్పుడు WHO చే ఆమోదించింది. ఈ టీకా అద్భుతమైన భద్రత, సమర్థతను చూపించింది. గొప్ప సహకారం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు” అన్నారు. వచ్చే ఆరు నెలల్లో కోవోవాక్స్‌ను ప్రారంభించాలని SII యోచిస్తోందని పూనావాలా చెప్పారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ‘కోవోవాక్స్’ రక్షణ కల్పిస్తుందని పరీక్షలు గొప్ప డేటాను చూపించాయని తెలిపారు. Kovovax ఇప్పటికీ భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) నుంచి అత్యవసర వినియోగ ఆమోదం కోసం వేచి ఉంది.