ఈ చిన్న చిన్న పొరపాట్లు లక్ష్మిదేవికి ఆగ్రహం తెప్పిస్తాయి.. ఫలితం పేదరికంలో మగ్గిపోతారు..

Poverty: లక్ష్మిదేవి సంపదకు అధిపతి. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారో వారి జీవితంలో దేనికీ లోటు ఉందు. ప్రతిచోటా ఆనందం ఉంటుంది.

ఈ చిన్న చిన్న పొరపాట్లు లక్ష్మిదేవికి ఆగ్రహం తెప్పిస్తాయి.. ఫలితం పేదరికంలో మగ్గిపోతారు..
ఇప్పటివరకు స్టైలిష్‌ పాత్రల్లోనే కనిపించిన బన్నీ ఈ సినిమాలో మొదటిసారిగా లారీ డ్రైవర్‌ పాత్రలో ఊరమాస్‌గా నటించాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా యాసను కూడా నేర్చుకున్నాడు.
Follow us

|

Updated on: Dec 17, 2021 | 12:18 PM

Poverty: లక్ష్మిదేవి సంపదకు అధిపతి. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారో వారి జీవితంలో దేనికీ లోటు ఉందు. ప్రతిచోటా ఆనందం ఉంటుంది. కానీ మాతా లక్ష్మికి కోపం వస్తే ఆ వ్యక్తి పేదరికాన్ని భరించాల్సి ఉంటుంది. జీవితంలోని అతడిని సమస్యలు చుట్టుముడుతాయి. బతకడం అతడికి ఒక నరకంలా మారుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నప్పటికీ కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తారు. ఇవి అమ్మకు కోపం తెప్పిస్తాయి. దీంతో ఆ కుటుంబం పేదరికం, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ తప్పుల గురించి తెలుసుకొని వాటిని సరిదిద్దుకోండి. అప్పుడు మీరు లక్ష్మీదేవి అనుగ్రహానికి అర్హులుగా మారుతారు. అవేంటో తెలుసుకుందాం.

ఈ అలవాట్లను మెరుగుపరచుకోవడం అవసరం

1. రోజూ ఉదయాన్నే ఆలస్యంగా నిద్ర లేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి నిత్య పూజలు చేసి ఇంట్లో దీపం వెలిగించాలి.

2. చీపురు ఇంటిలోని మురికిని ఊడ్చివేస్తుంది కాబట్టి ఇంట్లోని చీపురు లక్ష్మీదేవికి ప్రతీకగా పరిగణిస్తారు. చీపురు ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచాలి.

3. ఇంట్లో బూట్లు, చెప్పులు, ఉపకరణాలు చెల్లాచెదురుగా ఉంటే వెంటనే ఈ అలవాటును మానుకోండి. లక్ష్మిదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది. అలాంటి చోట నివాసం ఉంటుంది.

4. మీ ఇంట్లో ఏదైనా చెడిపోయిన గడియారం ఉంటే వెంటనే దాన్ని తీసివేయండి. ఇది ఇంట్లో ప్రతికూలతను సృష్టిస్తుంది. అనేక సమస్యలను దారితీస్తుంది.

5. మీ ఇంట్లో శ్రీ యంత్రం ఉంటే దానిని క్రమం తప్పకుండా పూజించాలి. లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎందుకంటే శ్రీ యంత్రం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది.

ఈ పనులను క్రమం తప్పకుండా చేయండి

1. పేద యువతులకు అవకాశం దొరికినప్పుడల్లా సహాయం చేయండి. వారి వివాహం, చదువు మొదలైన వాటికి సహాయం చేయండి. దీని వల్ల మాతా లక్ష్మి సంతోషిస్తుంది.

2. కర్పూరం, లవంగాలతో ఇంట్లో సాయంత్రం హారతి నివ్వండి. ఇది ఇంటి ప్రతికూలతను తొలగిస్తుంది.

3. కనీసం వారానికి ఒకసారైనా ఇంటిని ఉప్పుతో తుడవండి. దీంతో నెగెటివిటీ తొలగిపోవడంతో పాటు ఇంట్లో వ్యాధులు తగ్గుతాయి.

4. మొదటి రోటీని ఆవుకి తినిపించండి. పేదవారికి ఆహారం అందించండి. దీంతో లక్ష్మిదేవి చాలా సంతోషిస్తుంది.

5. గులాబీ సువాసనతో కూడిన అగరుబత్తీలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం అమ్మవారి ముందు కాల్చి గులాబీలను సమర్పించండి. ఆవుకు బెల్లం తినిపిస్తే మంచిది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా రాయడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి.

Micromax: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కి విపరీతమైన తగ్గింపు.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..

కుక్కతో సెల్ఫీ ట్రై చేస్తున్నారా..! రంగు పడుద్ది జాగ్రత్త.. ఈ విషయం తెలిస్తే షాక్..

HDFC Life: రిటైర్మెంట్ ప్లాన్‌ని ప్రవేశపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.. పాలసీదారులకు అనేక ప్రయోజనాలు..