AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Life: రిటైర్మెంట్ ప్లాన్‌ని ప్రవేశపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.. పాలసీదారులకు అనేక ప్రయోజనాలు..

HDFC Life: ఉద్యోగ విరమణను దృష్టిలో ఉంచుకుని హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఒక వ్యక్తి,

HDFC Life: రిటైర్మెంట్ ప్లాన్‌ని ప్రవేశపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.. పాలసీదారులకు అనేక ప్రయోజనాలు..
Insurance Policy
Follow us
uppula Raju

|

Updated on: Dec 17, 2021 | 9:53 AM

HDFC Life: ఉద్యోగ విరమణను దృష్టిలో ఉంచుకుని హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఒక వ్యక్తి, సమూహం, నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, సేవింగ్స్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇది పాలసీ హోల్డర్‌లు రిటైర్మెంట్‌ సమయం వరకు క్రమపద్ధతిలో ఆదా చేసుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశంలో పెరుగుతున్న ఆయుర్దాయం, ద్రవ్యోల్బణంతో రిటైర్మెంట్ ప్రణాళిక కచ్చితంగా అవసరం.

రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక సమస్యలు లేకుండా జీవించాలంటే ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ప్లాన్‌ కచ్చితంగా అవసరం. ఒక నివేదిక ప్రకారం.. రిటైర్మెంట్‌ పొందిన చాలా మంది భారతీయులు పొదుపు లేకపోవడంతో నిరాశ్రయులైన జీవితాన్ని గడుపుతున్నారు. యాన్యుటీ వంటి బీమా కవరేజీ చివరి వయసులో మిమ్మల్ని కాపాడుతుంది. ఇది వినియోగదారుడిని పూర్తిగా కవర్ చేస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ సిస్టమాటిక్ రిటైర్‌మెంట్ ప్లాన్ పాలసీ ప్రారంభంలోనే వార్షిక వడ్డీ రేట్లను లాక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్లాన్‌కు రెండు ఎంపికలు ఉన్నాయి – లైఫ్ యాన్యుటీ, లైఫ్ యాన్యుటీ విత్ ప్రీమియంల వాపసు.

HDFC లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ ఫీచర్లు >> ఒక వ్యక్తి 5 నుంచి 15 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించే కాలాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. >> కస్టమర్‌లు 15 సంవత్సరాల వరకు మారటోరియం వ్యవధిని ఎంచుకోవచ్చు. >> ఈ ప్లాన్ ఎటువంటి వైద్య, పూచీకత్తు లేకుండా 24 గంటలలోపు జారీ చేస్తారు. >> పరిమిత కాలానికి ప్రీమియంలు చెల్లించడం ద్వారా హామీతో కూడిన ఆదాయాన్ని పొందవచ్చు. >> ప్రారంభ సమయంలో యాన్యుటీ రేటు హామీ ఇస్తారు. పాలసీ వ్యవధిలో మార్పు లేకుండా ఉంటుంది. >> రిటైర్మెంట్‌ తర్వాత హామీ ఇచ్చిన ఆదాయం మొత్తం చెల్లించిన ప్రీమియంలపై ఆధారపడి ఉంటుంది. >> LA-ROP ఎంపికతో మరణంపై చెల్లించిన మొత్తం ప్రీమియంల వాపసును ఎంచుకోవచ్చు. >> పథకాన్ని ఎంచుకోవడానికి ఒక వ్యక్తి కనీస వయస్సు 45 సంవత్సరాలు గరిష్టంగా 75 సంవత్సరాలు ఉండాలి. >> ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. >> ప్రీమియం చెల్లింపు వ్యవధి 5 ​​నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. >> రిటైర్మెంట్‌ జీవితాన్ని క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు ఆందోళన లేకుండా జీవిస్తారు.

పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..

NBCC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజ్‌మెంట్ ట్రైనీతో సహా అనేక పోస్టులు ఖాళీ.. ఎలా అప్లై చేయాలంటే..?

పాకిస్తాన్‌ నుంచి వచ్చి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాడు.. అతడి కొడుకు ఇప్పుడొక సూపర్‌ స్టార్..