NBCC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజ్‌మెంట్ ట్రైనీతో సహా అనేక పోస్టులు ఖాళీ.. ఎలా అప్లై చేయాలంటే..?

NBCC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. NBCC (National Buildings Construction Corporation Limited) ఇండియాలో ఉద్యోగం

NBCC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజ్‌మెంట్ ట్రైనీతో సహా అనేక పోస్టులు ఖాళీ.. ఎలా అప్లై చేయాలంటే..?
Nbcc
Follow us

|

Updated on: Dec 17, 2021 | 9:12 AM

NBCC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. NBCC (National Buildings Construction Corporation Limited) ఇండియాలో ఉద్యోగం పొందడానికి సువర్ణవకాశం. భారతదేశంలోని తొమ్మిది రత్న కంపెనీలు చేర్చబడిన NBCC ఇండియా, మేనేజ్‌మెంట్ ట్రైనీతో సహా అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- nbccindia.inకి వెళ్లాల్సి ఉంటుంది. NBCC ఇండియా విడుదల చేసిన ఈ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ 9 డిసెంబర్ 2021 నుంచి ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. చివరితేది జనవరి 8, 2022 నిర్ణయించారు. ఫీజును సమర్పించడానికి కూడా అదే చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి పూర్తిగా తనిఖీ చేయాలని సూచించింది.

ఖాళీ వివరాలు ఎన్‌బిసిసి ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 70 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎలక్ట్రికల్ కోసం 10 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ సివిల్ కోసం 40 పోస్టులు రిక్రూట్‌ చేస్తారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్‌కు కూడా 15 పోస్టులను కేటాయించారు. ఇది కాకుండా, ప్రాజెక్ట్ మేనేజర్ సివిల్ బ్యాక్‌లాగ్‌లో ఒక పోస్ట్, సీనియర్ స్టెనోగ్రాఫర్ బ్యాక్‌లాగ్‌లో ఒక పోస్ట్ భర్తీ చేస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ కోసం 3 పోస్టులు కేటాయించారు. పూర్తి ఖాళీ వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను సందర్శించండి.

ఇలా దరఖాస్తు చేసుకోండి 1. ముందుగా అధికారిక వెబ్‌సైట్- nbccindia.inకి వెళ్లండి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇవ్వబడిన రిక్రూట్‌మెంట్ విభాగానికి వెళ్లండి. 3. ఇప్పుడు “NBCC ఇండియా వివిధ పోస్ట్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ ఫారం 2021” లింక్‌కి వెళ్లండి. 4. ఇందులో “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” ఎంపికకు వెళ్లండి. 5. ఇప్పుడు అభ్యర్థించిన వివరాలను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 6. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను తప్పులు లేకుండా నింపండి

అర్హతలు ఈ పోస్టుల కోసం వేర్వేరు విద్యార్హతలను కోరింది. 60 శాతం మార్కులతో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎలక్ట్రికల్ బి.టెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుకు దరఖాస్తు చేయడానికి, బి. టెక్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. అదేవిధంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి.

డార్క్ చాక్లెట్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా..! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..

పాకిస్తాన్‌ నుంచి వచ్చి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాడు.. అతడి కొడుకు ఇప్పుడొక సూపర్‌ స్టార్..

జాన్‌ అబ్రహం హీరో కాకముందు ఏం చేసేవాడో తెలుసా..? నేడు అతనొక బాలీవుడ్‌ సూపర్ స్టార్‌..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే