AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాన్‌ అబ్రహం హీరో కాకముందు ఏం చేసేవాడో తెలుసా..? నేడు అతనొక బాలీవుడ్‌ సూపర్ స్టార్‌..

John Abraham: ఈరోజు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పుట్టినరోజు. ఇతడు 1972 డిసెంబర్ 17న కేరళలో జన్మించారు. అతడి తల్లి పార్సీ,

జాన్‌ అబ్రహం హీరో కాకముందు ఏం చేసేవాడో తెలుసా..? నేడు అతనొక బాలీవుడ్‌ సూపర్ స్టార్‌..
John Abraham
uppula Raju
|

Updated on: Dec 17, 2021 | 8:07 AM

Share

John Abraham: ఈరోజు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పుట్టినరోజు. ఇతడు 1972 డిసెంబర్ 17న కేరళలో జన్మించారు. అతడి తల్లి పార్సీ, తండ్రి మలయాళీ. జాన్‌ పార్సీ పేరు ఫర్హాన్ అయితే తండ్రి సినిమాల వల్ల జాన్ అని పేరు పెట్టాడు. నటుడు మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. సోషల్ మీడియాలో జాన్ అబ్రహంకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన అభిమానులు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నారు.

జాన్‌కి ఈ రోజుకి 48 ఏళ్లు. మోడలింగ్ సమయంలో డబ్బు లేకపోవడంతో అతడు కొన్ని రోజులు మీడియా ప్లానర్‌గా పనిచేశాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. జాన్‌ అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించాడు. 2003లో ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో అతనితో పాటు బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘సాయా’, ‘పాప్‌’ సినిమాల్లో చేశాడు. 2004లో ‘ధూమ్’ అనే యాక్షన్ సినిమాతో అతని కెరీర్‌కి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. తరువాత అతను గరం మసాలా, దోస్తానా, వెల్‌కమ్ బ్యాక్, ఫోర్స్ -2, అటామిక్, సత్యమేవ జయతే వంటి అనేక చిత్రాలలో నటించాడు. జాన్ అబ్రహం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, ఎన్నారై ప్రియా రుచల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక బ్యాంకర్, సినిమాలను పట్టించుకోదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇద్దరూ పూర్తిగా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు. ప్రియా లండన్ బిజినెస్ స్కూల్‌లో చదువుకుంది ఆమె లాస్ ఏంజిల్స్‌లో నివసించేది. జాన్‌ ప్రశాంతంగా ఉంటాడు అతని అలవాట్లంటే తనకు చాలా ఇష్టమని ప్రియా చెప్పుకొచ్చేది.

జాన్ బైక్ ప్రేమికుడు జాన్ అబ్రహంకు బైక్‌లంటే చాలా ఇష్టం. అతని వద్ద లక్షల రూపాయల విలువైన బైక్‌లు ఉన్నాయి. వీటిలో BMW, హోండా CBR, అప్రిలియా, యమహా ఉన్నాయి. ఎంవీ అగస్టా, డుకాటీ వంటి కంపెనీల బైక్‌లు ఉన్నాయి. జాన్ 48 సంవత్సరాల వయస్సులో కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్, అతను ఎలాంటి ధూమపానం, మద్యం సేవించడు, ఏ పార్టీలో కూడా పాల్గొనడు. జంతు ప్రేమికుడు, వివిధ సామాజిక సమస్యల కోసం పనిచేస్తాడు. అందుకే జాన్‌ అబ్రహం బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

అంపైర్‌ని చంపేస్తానని బెదిరించాడు.. కెరీర్‌ సర్వనాశనం చేసుకున్నాడు.. ఎవరో తెలుసా..?

అలసట, ఒళ్లు నొప్పులు భరించలేకపోతున్నారా..! ఈ రెండు డ్రింక్స్‌ మీకు సరైన పరిష్కారం..

కను రెప్పల అందానికి ప్రయత్నిస్తే కళ్లకే ప్రమాదం..! మహిళలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!