అంపైర్‌ని చంపేస్తానని బెదిరించాడు.. కెరీర్‌ సర్వనాశనం చేసుకున్నాడు.. ఎవరో తెలుసా..?

Zealand Club Cricketer: క్రికెట్ ఒక జెంటిల్‌ మెన్‌ ఆట. కానీ ఈ గేమ్‌లో కొన్నిసార్లు గొడవలు కూడా చోటు చేసుకుంటాయి. ఇది క్రికెట్‌ ఆటకే మచ్చగా

అంపైర్‌ని చంపేస్తానని బెదిరించాడు.. కెరీర్‌ సర్వనాశనం చేసుకున్నాడు.. ఎవరో తెలుసా..?
Club Cricketer
Follow us

|

Updated on: Dec 17, 2021 | 7:51 AM

Zealand Club Cricketer: క్రికెట్ ఒక జెంటిల్‌ మెన్‌ ఆట. కానీ ఈ గేమ్‌లో కొన్నిసార్లు గొడవలు కూడా చోటు చేసుకుంటాయి. ఇది క్రికెట్‌ ఆటకే మచ్చగా నిలుస్తుంది. అలాంటి ఘటనే ఒకటి న్యూజిలాండ్‌లో జరిగింది. నిజానికి అక్కడ ఒక క్రికెటర్ అంపైర్‌ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో అతను పెద్ద శిక్షనే ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంఘటన క్లబ్ స్థాయి క్రికెటర్‌కి సంబంధించినది. డిసెంబర్ 4న న్యూజిలాండ్‌లోని గిస్బోర్న్ నగరంలో జరిగిన మ్యాచ్ తర్వాత పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్‌ తిమోతీ వైర్‌పై జీవితకాల నిషేధం విధించింది. ఈ ఆటగాడు అంపైర్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఇది క్రికెట్ ప్రవర్తనా నియమావళి లెవల్ 4 ఉల్లంఘన.

హైస్కూల్ ఓల్డ్ బాయ్స్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత చివర్లో అంపైర్‌ను చంపేస్తానని బెదిరించినట్లు తిమోతీ వైర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆటగాడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదు. అయతే దీనిపై నిర్ణయం తీసుకున్న కమిటీ ఆధారాలతో జీవితకాల నిషేధం విధించింది. ఆటగాడు లెవల్ 4లో దోషిగా తేలిన తర్వాత అతని నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే హక్కు ఉండదు. పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తిమోతీ వైర్‌ను రెండుసార్లు దోషిగా నిర్ధారించింది. క్లబ్ ఛైర్మన్ ఐజాక్ హ్యూస్ ఈ మొత్తం విషయంపై బహిరంగంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన చాలా దారుణమని క్రికెట్‌లో అలాంటి వారికి స్థానం లేదని తేగేసి చెప్పారు.

కేసు తీవ్రతను గ్రహించి స్వతంత్ర ప్యానెల్‌తో పరిష్కరించారు. సమగ్ర దర్యాప్తు చేయడమే కాకుండా సాక్షుల వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరించింది. దీనిపై ఇంకా బోర్డు ఏమీ చెప్పే స్థితిలో లేదని న్యూజిలాండ్ క్రికెట్ మేనేజర్ రిచర్డ్ బుక్ తెలిపారు. సెప్టెంబర్‌లో ఇద్దరు ప్రత్యర్థులను చిత్రహింసలకు గురిచేసినందుకు ఓ క్రికెటర్‌పై మూడున్నరేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అలసట, ఒళ్లు నొప్పులు భరించలేకపోతున్నారా..! ఈ రెండు డ్రింకులు మీకు సరైన పరిష్కారం..

కను రెప్పల అందానికి ప్రయత్నిస్తే కళ్లకే ప్రమాదం..! మహిళలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే