Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 చిత్రం ఆన్‌లైన్ లీక్‌లలో కనిపించింది. ఇది డిజైన్ కొన్ని ఫీచర్ల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
Royal Enfield
Follow us
uppula Raju

|

Updated on: Dec 15, 2021 | 2:22 PM

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 చిత్రం ఆన్‌లైన్ లీక్‌లలో కనిపించింది. ఇది డిజైన్ కొన్ని ఫీచర్ల గురించి సమాచారాన్ని అందిస్తుంది. వచ్చే ఏడాది మధ్యలో ఈ బైక్‌ను భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయం ఓ వీడియో ద్వారా వెల్లడైంది. ఇందులో 648 సిసి ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. చెన్నైకి చెందిన ఈ మోటార్‌ సైకిల్ బ్రాండ్ వచ్చే ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్  స్క్రమ్ 411 (హిమాలయన్ వెర్షన్), హంటర్ 350, సూపర్ మెటోర్ 650 అనే పలు బైకులను విడుదల చేయనుంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ క్రూయిజర్ వచ్చే ఏడాది మధ్యలో నాక్ చేయవచ్చు.

ఇది ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 కంటే ఎక్కువ వెర్షన్ అయి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 648 Lc ట్విన్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 47 PS పవర్, 52 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650లలో ఇదే ఇంజన్ కనిపిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేయబడినట్లు కనిపిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 ధర గురించి మాట్లాడితే రాబోయే క్రూయిజర్ బైక్ ధర 30 వేల రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. కాంటినెంటల్ GT 650 ధర దాదాపు 3.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చు. అయితే దీని ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ప్రకటించలేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 డిజైన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 డిజైన్ పాత మోడల్‌కు భిన్నంగా ఉండదు. అయితే కొన్ని మార్పులు ఆకర్షణీయంగా కొత్తవిగా ఉంటాయి. మొదట కంపెనీ ట్యాంక్‌పై కొత్త ఆకారంలో పేరు రాసింది. ఇది కొన్ని దశాబ్దాల క్రితం కనిపించింది. ఇది పెద్ద విండ్‌స్క్రీన్, నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్ పొజిషనింగ్, విశాలమైన సీటు, సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీంతో పాటు, వృత్తాకార అద్దాలు కూడా అందించారు. దీనికి రెండు వైపులా డిస్క్ బ్రేక్ సిస్టమ్ లభిస్తుంది. ఇందులో డ్యూయల్ ABS ఛానెల్ ఉంటుంది. అలాగే, ఇది సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది ట్రిప్పర్ నావిగేషన్‌తో వస్తుంది. అయితే ఈ ఫీచర్లన్నింటినీ కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.

తల్లిదండ్రులకు హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు చాలా ప్రమాదం..

JNVST 2022: నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు నేడే ఆఖరు తేది.. అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి..

Indian Coast Guard 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో పోస్టులు..