Whatsapp Feature Update: అందుబాటులోకి వాయిస్ మెసేజ్ రివ్యూ ఫీచర్‌.. ఎలా ఉపయోగించాలంటే?

సరికొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకోవడంతో వాట్సప్ ముందుంటుంది. మారుతున్న కాలానికి అనుగునంగా ఎన్నో మార్పులు చేసింది. ప్రస్తుతం మరో ఫీచర్‌ను వాట్సప్ యూజర్లకు అందించనుంది.

Whatsapp Feature Update: అందుబాటులోకి వాయిస్ మెసేజ్ రివ్యూ ఫీచర్‌.. ఎలా ఉపయోగించాలంటే?
Wahtsapp Voice Message Review Feature
Follow us
Venkata Chari

|

Updated on: Dec 15, 2021 | 1:04 PM

Voice Message Review Feature: సరికొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకోవడంతో వాట్సప్ ముందుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులను ఇప్పటికే యాప్‌లో చేర్చింది. ప్రస్తుతం మరో ఫీచర్‌ను వాట్సప్ యూజర్లకు అందించనుంది. వాయిస్ సందేశాలను ఫోన్‌లోని కాంటాక్ట్‌లకు పంపే ముందు వాటిని ప్రివ్యూ చూడొచ్చు. ఈమేరకు ఈ అప్‌డే‌ట్‌ను విడుదల చేయనున్నట్లు వాట్సప్ ప్రకటించింది. కొత్త అప్‌డేట్‌తో మీ వాయిస్ సందేశాలను విని, ఆడియో మంచిగా ఉందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ అందులో ఏదైనా సమస్య ఉంటే మాత్రం దానిని డిలీట్ చేసి మరో వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపే అవకాశం ఉంది.

వాట్సాప్‌లోని వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్ వ్యక్తిగత, గ్రూప్ చాట్‌లలోనూ పనిచేస్తుంది. అలాగే, ఇది Android, iOSతోపాటు వెబ్, డెస్క్‌టాప్‌తో సహా అన్ని ప్లాట్‌ఫారమ్‌ల కోసం విడుదల చేయనున్నట్లు వాట్సప్ పేర్కొంది.

వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలంటే? మీ మొబైల్‌లో వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఫీచర్‌ని ఉపయోగించడానికి వాట్సప్ చాట్‌లోని మైక్రోఫోన్ బటన్‌ను తాకి, హ్యాండ్స్-ఫ్రీ రికార్డింగ్‌ను లాక్ చేయడానికి దాన్ని పైకి స్లైడ్ చేయాలి. ఇందులో మీకు స్టాప్ బటన్, ట్రాష్ క్యాన్ బటన్‌ కనిపిస్తాయి. స్టాప్ బటన్‌ను నొక్కి, ఆపై మీ వాయిస్ మెసేజ్‌ను షేర్ చేయడానికి ముందు ప్లే బటన్‌ను నొక్కాలి. స్లీక్ బార్‌పై నొక్కి ఆడియోలోని నిర్దిష్ట భాగాన్ని కూడా వినొచ్చు.

డిలీట్ ఎలా చేయాలంటే? మీరు రికార్డ్ చేసిన సందేశం నచ్చకపోతే, మీరు ట్రాష్ క్యాన్‌పై నొక్కి దాన్ని తొలగించవచ్చు. మరలా మీరు సెండ్ బటన్ నొక్కడం ద్వారా వేరే వాయిస్‌ను రికార్డ్ చేసి పంపవచ్చు. మీరు వాట్సాప్‌లో వారి టెక్స్ట్ వెర్షన్‌లో వాయిస్ సందేశాలను పంపాలనుకుంటే, ప్రివ్యూ ఫీచర్‌ని జోడించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ వాయిస్ సందేశాలను మీ స్నేహితులకు పంపే ముందు వాటిని డ్రాఫ్ట్ చేయడానికి వాట్సప్ అనుమతిస్తుంది.

Also Read: Apple iPhones: సరికొత్త ఫీచర్లతో రానున్న యాపిల్ కొత్త ఐఫోన్లు.. కెమెరా, ర్యామ్‌లో భారీ మార్పులు..!

SmartPhone Under 25K: స్మార్ట్‌ ఫోన్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? రూ. 25 వేల లోపు బెస్ట్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!