- Telugu News Photo Gallery Technology photos Planning to buy new smartphone have a look on best smartphones under 25000
SmartPhone Under 25K: స్మార్ట్ ఫోన్ ప్లాన్ చేస్తున్నారా.? రూ. 25 వేల లోపు బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
SmartPhone Under 25K: మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ హల్చల్ చేస్తున్నాయి. రోజుకో కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుండడంతో రెగ్యులర్‌గా ఫోన్లను మార్చేస్తున్నారు. మీరు కూడా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే రూ. 25 వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్స్ వివరాలు..
Narender Vaitla | Edited By: Ram Naramaneni
Updated on: Dec 15, 2021 | 9:54 AM

రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోన్న నేపథ్యంలో ఏ ఫోన్‌ను కొనుగోలు చేయాలో తెలియక తికమక పడుతున్నారా.? అయితే రూ. 25 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్ల వివరాలు మీకోసం..

OnePlus Nord CE 5G: తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ బ్రాండ్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో వన్‌ప్లాస్ నార్డ్ సీఈ 5జీ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ రూ. 24,999కి అందుబాటులో ఉంది. ఇక ఇందులో 6.43 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించిన ఈ ఫోన్‌లో 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇక ఇందులో 64 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Mi 11 Lite: రూ. 25 వేలలోపు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌లో ఎమ్‌ఐ 11 లైట్ ఒకటి. ఈ ఫోన్‌లో 1080x2400 పిక్సెల్స్‌తో కూడిన 6.55 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 22,499గా ఉంది.

Motorola Edge 20 Fusion: మోటోరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చిందే ఎడ్జ్ 20 ఫ్యూజియన్ ఫోన్. ఇందులో 6.7 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 21,499గా ఉంది. కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు.

iQOO Z3: రూ. 25వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఐక్యూ జెడ్ 3 ఒకటి. ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 4400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 768జీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 20,990గా ఉంది.





























