- Telugu News Photo Gallery Technology photos Kodak launches new smart tv kodak 7x pro have a look on features and price details
kodak 7x pro: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ టీవీ.. కొడాక్ 7 ఎక్స్ ప్రో ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
kodak 7x pro: కొడాక్ కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. కొడాక్ 7 ఎక్స్ ప్రో పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రూపొందించారు.
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Dec 16, 2021 | 6:47 AM

ప్రస్తుతం స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ స్మార్ట్ టీవీల తయారీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కొడాక్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. కొడాక్ 7ఎక్స్ ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీ సేల్స్ ప్రారంభమవయ్యాయి.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఏఆర్ఎం కార్టెక్స్ ఏ53 SoC ప్రాసెసర్‌ను అందించారు. దీంతో పాటు డ్యూయల్-బ్యాండ్ వైఫై కనెక్టివిటీ, 40W ఆడియో అవుట్‌పుట్‌ను ఇచ్చారు. గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికొస్తే.. కొడాక్ 7 ఎక్స్ ప్రో 43 అంగుళాల మోడల్ రూ. రూ. 23,999 కాగా, కొడాక్7 ఎక్స్ ప్రో- 50 అంగుళాల మోడల్ రూ. 30,999కి అందుబాటులో ఉంది. అలాగే కొడాక్ 7 ఎక్స్ ప్రో, 55 అంగుళాల వేరియంట్ రూ. 33,999గా ఉంది.

ఈ టీవీలో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను అందించారు. వీటితో పాటు బ్లూటూత్ v5, ఈథర్నెట్ పోర్ట్, మూడు హెచ్‌డీఎం పోర్ట్‌లు, రెండు యూఎస్బీ పోర్ట్‌లు ఇచ్చారు.

గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే స్క్రీన్ మిర్రరింగ్ ఈ టీవీ మరో ప్రత్యేకత. అంతేకాకుండా 3.5 ఎంఎం ఆడియో జాక్, ఒక కాంపోనెంట్ కేబుల్ సపోర్ట్ ఇచ్చారు.





























