కను రెప్పల అందానికి ప్రయత్నిస్తే కళ్లకే ప్రమాదం..! మహిళలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Eyes: మహిళలు అందంగా కనిపించడానికి అనేక రకాల మేకప్, బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో మేకప్‌కి సంబంధించిన పలు రకాల

కను రెప్పల అందానికి ప్రయత్నిస్తే కళ్లకే ప్రమాదం..! మహిళలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
Eyelash
Follow us
uppula Raju

|

Updated on: Dec 15, 2021 | 2:44 PM

Eyes: మహిళలు అందంగా కనిపించడానికి అనేక రకాల మేకప్, బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో మేకప్‌కి సంబంధించిన పలు రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ అయినా, పార్టీ అయినా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడానికి పోటీ పడుతారు. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చుకోవడానికి చిన్న విషయాలపై కూడా పెద్ద శ్రద్ద వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్ల అందం కోసం మహిళలు విపరీతంగా కనురెప్పలకు బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడుతున్నారు. ఇలా చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కళ్లకే ప్రమాదం.

అసలు వెంట్రుకలను దెబ్బతీస్తుంది కనురెప్పలకు కృత్రిమంగా వెంట్రుకలను అమర్చుతున్నారు. ఉన్నవాటిని మరింత పొడవుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నిజమైన వెంట్రుకలు దెబ్బతింటున్నాయి. దీని వల్ల కళ్లకి ఎఫెక్ట్ పడుతుంది. చూపు సమస్యలు ఎదురవుతున్నాయి. మంట, వాపు వస్తున్నాయి. సాధారణంగా బ్రాండెడ్‌ మేకప్ వస్తువులను వాడటం వల్ల కళ్ళకు హాని జరగదని మహిళలు భావిస్తారు. కానీ అది నిజం కాదు. కనుబొమ్మ వెంట్రుకలు పొడిగించడానికి వాడే జిగురులో ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఇది ఏ కంపెనీది వాడుతున్నారనేది ముఖ్యం కాదు కచ్చితంగా ఇది కళ్లకి హాని చేస్తుంది.

కళ్ళ మంట, వాపు వంటి సమస్యలకు కారణమవుతుంది. మీరు చాలా కాలంగా కనురెప్పలకు మేకపు, వెంట్రుకల పొడవుకు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటే కొన్ని రోజుల తర్వాత వాటి దుష్ప్రభావాలు అనుభవించక తప్పదు. కళ్ళు మంట, వాపు, కనురెప్పలపై చికాకును అనుభవిస్తారు. అంతేకాదు కంటి ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది. కళ్లు పొడిబారుతాయి. దీనివల్ల దృష్టి మందగిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది.

చాణక్య నీతి: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆచార్య చెప్పిన ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోకండి..