Side Effects of Amla: ఈ వ్యక్తులు ఉసిరికాయలను అస్సలు తినకూడదట.. ఎందుకో తెలుసుకోండి..
ఉసిరికాయ ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సీ, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్
ఉసిరికాయ ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సీ, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పాస్పరస్ వంటి అనేక పోషకాలున్నాయి. ఇది ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చలికాలంలో ఉసిరికాయ అనేక ప్రయోజనాలు అందిస్తుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికాయను అసలు తినకూడదు. ఎందుకో తెలుసుకుందామా.
అసిడిటీ సమస్య ఉన్నవారు ఉసిరికాయను అస్సలు తీసుకోవద్దు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. హైపర్ యాసిడిటీ సమస్యలో ఉసిరి కాయను తీసుకుంటే కడుపులో చికాకు కలిగించవచ్చు. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గేవారు ఉసిరికాయను తీసుకోవద్దు. ఉసిరికాయలో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే గుణం ఉంటుంది.
శస్త్రచికిత్స చేయించుకున్న వారు.. లేదా చేసుకోబోతున్నవారు ఉసిరి కాయలను అస్సలు తీసుకోవద్దు. ఉసిరిలో రక్తాన్ని పలుచగా మార్చే గుణం ఉంది. ఉసిరికాయ తినడం వలన రక్తస్రావం సమస్యలు ఉండవచ్చు. దీనికారణంగా.. కణజాల హైపోక్సేమియా, సీవీఆర్ అసిడోసిస్ లేదా బహుళ అవయవలు పనిచేయకపోవడం జరుగుతుంది.
చలికాలంలో చర్మం పొడిబారినట్లయితే శరీరంపై దురద లేదా దద్దుర్లు వంటి సమస్యలు ఉన్నవారు ఉసిరికాయను అస్సలు తీసుకోవద్దు. దీంతోపాటు పొడి శిరోజాలు, చుండ్రు సమస్యలు ఉన్నవారు ఉసిరి కాయను అస్సలు తీసుకోవద్దు. ఇది డీహైడ్రేషన్ సమస్యలను కలిగిస్తుంది. బ్లీడింగ్ డిజార్డర్ సమస్య ఉన్నవారు ఉసిరికాయను అస్సలు తీసుకోవద్దు. ఇందులో యాంటీ ప్లేట్ లెట్ గుణాలు ఉన్నాయి. దీంతో ఇది రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..
Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..