Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్

Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2021 | 3:02 PM

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో తెరకెక్కుతున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వరంగల్‌లో శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… విడుదల చేసిన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. మీరంటే ఇంకా ఇష్టం. ఇక్కడికి వస్తున్నామని చెప్పడంతో మంత్రి దయాకర్ గారు అంతా చూసుకున్నారు. ఇండస్ట్రీలో హీరోలంతా కూడా సుమ డేట్ల గురించి ఎదురుచూస్తుంటారు. అదే మీరు.. అదే నేను.. అదే పల్లవి.. అంతకు మించిన రిజల్ట్ ఈ 24న చూడబోతోన్నారు. ఎంసీఏ బ్లాక్ బస్టర్ కదా? అని ఇక్కడకు రాలేదు. ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ ఉంది.. మళ్లీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు.. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. ఆ సినిమా చూసి నేను డిసైడ్ చేయకూదని అనుకున్నాను. కానీ ఈ రోజు నా సినిమాను చూశాను. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది.

నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. ఇది నాకు సొంత బ్యానర్‌లా ఉంది. ఇలా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మా ప్రయాణం మొదలవ్వడం ఆనందంగా ఉంది. కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరికీ మళ్లీ అవార్డులు వస్తాయని నమ్మకం ఉంది. అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సాయి పల్లవి నుంచి మీరు ఎంత డ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు. మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. అందులో నేను నటించాల్సిన అవసరం రాలేదు. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయాను. సాయి పల్లవి డాన్స్ చూసి నేను నటించడం మర్చిపోయాను.. నిజమే ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతారు. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే. ఈ పాత్రను అర్థం చేసుకుంటుందా? లేదా? అని అనుకున్నాను. కానీ ప్రతీ రోజూ సెట్‌లో ఆమె తన పాత్ర కోసం కేర్ తీసుకునేది. భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఆమె పాత్ర ఎంతో బాగుంటుంది.

అరేయ్ నాన్న నేను నీ ఒక్కడికే ఫ్యాన్ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఉందిరా అని అనేవారు. ఆయనకు ఆ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఆయన చివరి పాట శ్యామ్ సింగ రాయ్ కోసం రాయడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. మీరు మిస్ అయ్యారని తెలుసు. నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు’ అని అన్నారు నాని.

Also Read: Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ దాడి.. విజయ్‌ సేతుపతికి చెన్నై కోర్టు సమన్లు..

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న స్టార్ నటుడు ఎవరో గుర్తించండి.. ఆయన సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసే వ్యక్తి

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..