Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్‌.. ఆదిపురుష్‌ టీంకు సర్ ప్రైజ్ గిఫ్ట్స్‌..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తన సహనటులను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డార్లింగ్‌ సెట్‌లో ఉంటే అంతా సందడి సందడిగా

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్‌.. ఆదిపురుష్‌ టీంకు సర్ ప్రైజ్ గిఫ్ట్స్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 2:11 PM

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తన సహనటులను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డార్లింగ్‌ సెట్‌లో ఉంటే అంతా సందడి సందడిగా ఉంటుందని అతనితో కలిసి పనిచేసిన నటీనటులు చెబుతుంటారు. ఇక తన కో-యాక్టర్స్‌ కోసం ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేయించి మరీ సెట్‌ కు తీసుకొస్తుంటాడీ హ్యాండ్సమ్‌ హీరో. ఇందులో భాగంగా గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమా షూటింగ్‌ల సందర్భంగా తన తోటి నటీనటులకు భారీగా విందులు ఏర్పాటుచేసి సర్‌ప్రైజ్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌లో హీరోయిన్‌ పూజా హెగ్డే, అలనాటి తార భాగ్యశ్రీలకు రుచికరమైన వంటకాలతో భారీ ట్రీట్‌ ఇచ్చారు. ఇటీవల తన ‘ప్రాజెక్టు- కె’ (వర్కింగ్‌ టైటిల్‌) హీరోయిన్‌, ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెకు కూడా అదిరిపోయే ఐటమ్స్‌తో భారీ లంచ్‌ ఏర్పాటుచేశారు. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమా బృందానికి ఖరీదైన వాచెస్‌లను బహుమతిగా ఇచ్చారు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక సినిమాలో ప్రభాస్‌ రాముని పాత్రలో కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్, రావణుడి సైఫ్ ఆలీఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల తన పార్ట్ షూట్ ను కంప్లీట్‌ చేసిన ప్రభాస్ .. చిత్ర బృందానికి ఖరీదైన ర్యాడో రిస్ట్ వాచెస్ లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. కాగా ఈసినిమా బృందంలోని ఒకరు ఈ విషయం గురించి చెబుతూ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రభాస్‌ మంచి మనసును చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read:

Pushpa : ఉర్రూతలూగిస్తోన్న సమంత స్పెషల్‌ సాంగ్‌.. షేక్‌ అవుతోన్న యూట్యూబ్‌ రికార్డ్స్‌..

Allu Arjun: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన బన్నీ.. అభిమానులే తన విలువైన ఆస్తి అని ప్రకటన

Ganapath: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న ప్రముఖ దక్షిణాది నటుడు.. టైగర్‌తో కలిసి స్ర్కీన్‌ షేరింగ్‌..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?