Pushpa : ఉర్రూతలూగిస్తోన్న సమంత స్పెషల్‌ సాంగ్‌.. షేక్‌ అవుతోన్న యూట్యూబ్‌ రికార్డ్స్‌..

Samantha Special Song: ప్రస్తుతం టాలీవుడ్‌లో 'పుష్ప' నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సమంతా నటించిన '

Pushpa : ఉర్రూతలూగిస్తోన్న సమంత స్పెషల్‌ సాంగ్‌.. షేక్‌ అవుతోన్న యూట్యూబ్‌ రికార్డ్స్‌..
Samantha Special Song In Pushpa
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2021 | 12:47 PM

Samantha Special Song: ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘పుష్ప’ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సమంతా నటించిన ‘ఊ అంటావా మామా.. ఊహూ అంటావా’ పాటకు యూట్యూబ్‌ రికార్డులు బద్ధలవుతున్నాయి. మత్తు వాయిస్‏తో సాగే ఈ పాటకు సామ్‌ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్ తన మాస్‌బీట్స్‌తో మరోసారి మాయచేయగా.. ఇక సింగర్ ఇంద్రావతి చౌహాన్ వాయిస్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. తన హస్కీ వాయిస్‌తో ఈ పాటను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లిందీ ఫోక్‌ సింగర్‌. ఆమె మరెవరో కాదు ప్రముఖ సినీ నేపథ్య గాయని మంగ్లీ చెల్లెలు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకున్న ఈ పాటకు (తెలుగులో) ఇప్పటివరకు 3 కోట్లకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. ఇక అన్ని భాషల్లో కలిపి 4.5 కోట్ల మంది ఈ పాటను వీక్షించారు. సుమారు 1.6 కోట్ల మంది లైకుల వర్షం కురిపించారు.

కాగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్పరాజ్‌’గా కనిపించనున్నాడు. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన సందడి చేయనుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈచిత్రంలో అనసూయ, సునీల్‌, ఫాహద్‌ ఫాజిల్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు సృష్టిస్తోన్న ఈచిత్రం రిలీజ్‌ తర్వాత మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?