Ganapath: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న ప్రముఖ దక్షిణాది నటుడు.. టైగర్‌తో కలిసి స్ర్కీన్‌ షేరింగ్‌..

మలయాళంలో 150కి పైగా సినిమాల్లో నటించి సినిమా ప్రేక్షకుల మెప్పు పొందిన విలక్షణ నటుడు 'రెహ్మాన్‌'. 16 ఏళ్ల ప్రాయంలోనే సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన పలు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించి

Ganapath: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న ప్రముఖ దక్షిణాది నటుడు.. టైగర్‌తో కలిసి స్ర్కీన్‌ షేరింగ్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 11:58 AM

మలయాళంలో 150కి పైగా సినిమాల్లో నటించి సినిమా ప్రేక్షకుల మెప్పు పొందిన విలక్షణ నటుడు ‘రెహ్మాన్‌’. 16 ఏళ్ల ప్రాయంలోనే సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన పలు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ‘బిల్లా’, ‘సింహా’, ‘ఊసరవెళ్లి’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘జనతా గ్యారేజ్‌’, ‘అంతరిక్షం’ ఇటీవల వచ్చిన ‘సిటిమార్‌’ చిత్రాల్లో కీలక పాత్రల్లో అలరించాడు రెహ్మాన్‌. మలయాళం సీరియల్స్‌లోనూ నటించి అక్కడి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా నటుడిగా నాలుగు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఆయన త్వరలోనే బాలీవుడ్‌లో కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. యాక్షన్‌ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కనున్న ‘గణ్‌పత్‌’ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించనున్నాడు.

ప్రముఖ దర్శకుడు వికాస్‌ బల్ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం యూరప్‌లో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా రెహ్మాన్‌ కూడా ఈ సినిమా సెట్‌లో జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. హీరో టైగర్‌, డైరెక్టర్‌ వికాస్‌బల్‌తో కలిసి ఆయన దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా సర్క్యులేట్‌ అవుతున్నాయి.

Also Read:

Harnaaz Sandhu: త్వరలోనే వెండితెరపై మిస్‌ యూనివర్స్‌! అప్పుడే రెండు సినిమాలకు సైన్‌!

Unstoppable with NBK: బాలయ్య టాక్‌షోకు తదుపరి చీఫ్‌ గెస్టులు వీరే..

Puneeth Rajkumar: త్వరలోనే సాకారం కానున్న పునీత్‌ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి రాజ్‌కుమార్‌ పూరిల్లు..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?