Unstoppable with NBK: బాలయ్య టాక్‌షోకు తదుపరి చీఫ్‌ గెస్టులు వీరే..

ఇటు సినిమాలతో వెండితెర ప్రేక్షకులను, అటు టీవీ టాక్‌షోతో బుల్లితెర ప్రేక్షకులను ఒకేసారి అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ.

Unstoppable with NBK: బాలయ్య టాక్‌షోకు తదుపరి చీఫ్‌ గెస్టులు వీరే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 11:22 AM

ఇటు సినిమాలతో వెండితెర ప్రేక్షకులను, అటు టీవీ టాక్‌షోతో బుల్లితెర ప్రేక్షకులను ఒకేసారి అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ‘అఖండ’ విజయోత్సాహంలో ఉన్న ఆయన ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ కోసం ఓ టాక్‌ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే’ పేరుతో సాగే ఈ చిట్‌ఛాట్ షో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్‌ రావిపూడి తదితర ప్రముఖులు ఇప్పటికే ఈ టాక్‌షోలో సందడి చేశారు. ఇటీవలే ‘అఖండ’ టీం కూడా హాజరై పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కాగా త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ టాక్‌షోలో పాల్గొననున్నారు. తాజాగా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది ‘ఆహా’. దీనికి సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కాగా బాలయ్య గాయ పడడంతో కొన్ని రోజుల పాటు అన్‌స్టాపబుల్ షో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన కోలుకోవడంతో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులను ఈ టాక్‌షోకు రప్పించనున్నారు. కాగా ‘అఖండ’ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లోనూ రాజమౌళి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఒక ‘ఆటంబాంబ్‌’ అని దర్శకధీరుడు ప్రశంసలు కురిపించారు. ఇక సినిమాల విషయానికొస్తే ‘అఖండ’ ను మరింత ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నారు బాలకృష్ణ. ఇక రాజమౌళి తన తాజా చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వరుసగా ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

Also Read:

Puneeth Rajkumar: త్వరలోనే సాకారం కానున్న పునీత్‌ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి రాజ్‌కుమార్‌ పూరిల్లు..

Shyam Singha Roy: ‘ఆయనకు అప్పుడే సినిమా చూపిస్తే బాగుండేది’.. సిరివెన్నెల గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన నాని..

Radhe Shyam: ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన రాధేశ్యామ్‌ టీమ్‌.. భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఎప్పుడంటే..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం