Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: ‘ఆయనకు అప్పుడే సినిమా చూపిస్తే బాగుండేది’.. సిరివెన్నెల గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన నాని..

Shyam Singha Roy: న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి...

Shyam Singha Roy: 'ఆయనకు అప్పుడే సినిమా చూపిస్తే బాగుండేది'.. సిరివెన్నెల గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయిన నాని..
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 15, 2021 | 9:54 AM

Shyam Singha Roy: న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్రయూనిట్‌ తాజాగా మంగళవారం వరంగల్‌లో రాయల్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను సైతం విడుదల చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో భాగంగా నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగ రాయ్’ను చూసిన తర్వాత మీరు ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నా. కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరికీ మళ్లీ అవార్డులు వస్తాయని నమ్మకం ఉంది. అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సాయి పల్లవి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంటుంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. అందులో నేను నటించాల్సిన అవసరం రాలేదు. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయా. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే అయినా, తన పాత్ర కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇక దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి తన చివరి పాటను ఇదే సినిమాకు రచించిన విషయం తెలిసిందే. ఈ విషయమై నాని మాట్లాడుతూ ఎమోషన్‌కు లోనయ్యారు. ఈ విషయమై మాట్లాడుతూ.. ‘అరేయ్ నాన్న నేను నీ ఒక్కడికే ఫ్యాన్’ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. ‘చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు సినిమా చూడాలని ఉందిరా’ అని అనేవారు. ఆయనకు ఈ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఆయన చివరి పాట శ్యామ్ సింగ రాయ్ కోసం రాయడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Viral Video: నాన్ వెజ్ అంటే నో అంటున్న పిల్లి.. షాక్ అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్

త్వరలో ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు !! వీటి ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !! వీడియో

Rashmika Mandanna: రారా సామి అంటూ ఆఫ్‌ స్ర్కీన్‌లో రష్మిక స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..